
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని కోతులను పట్టుకున్న కాంట్రాక్టర్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు ఆదివారం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఎర్టిగా కారులో ఒకరు 50 కోతులకు ఓ కాంట్రాక్టర్‌కు రూ.2 లక్షల వరకు సొమ్ము చెల్లించి తరలించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టుకున్న కోతులను ఏటూరునాగారం అడవుల్లోకి తర లించాల్సిన కాంట్రాక్టర్ వ్యాపారికి విక్రయిస్తు న్నారనే సమాచారం మేరకు ఓ జర్నలిస్టు బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా.. కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం.
కోతుల విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు బల్దియా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సీసీ కెమెరాల్లో రికా ర్డు అయినట్లు చర్చ జరుగుతోంది. ఈవిషయ మై సీఎంహెచ్‌ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. తనకు కూడా సమాచారం అందిందని, సోమ వారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాల యంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వివరా లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కోతు లను విక్రయించినట్టు తేలితే సదరు కాంట్రాక్ట ర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.