AP: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన | IMD Weather Report: Rain Forecast To Many Districts In AP For Two Days, More Details Inside | Sakshi
Sakshi News home page

AP IMD Rainfall Weather Report: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన

May 12 2024 9:12 AM | Updated on May 12 2024 2:24 PM

Rain Forecast To Many Districts In AP

సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు(పోలింగ్‌ రోజు) కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

కాగా, ఏపీ వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలిపింది.

 

 

ఇక, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement