అలర్ట్‌.. తెలంగాణకు భారీ వర్ష సూచన..  | IMD Predicts Moderate To Heavy Rain In Many Districts Of Telangana For 2 Days - Sakshi
Sakshi News home page

Telangana IMD Weather Report: అలర్ట్‌.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. 

Sep 22 2023 7:51 AM | Updated on Sep 22 2023 9:04 AM

IMD Predicts Heavy Rain Forecast To Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇక, తాజాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగాం, యాదాద్రి, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement