చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు | Moderate rains for next 3 days in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు

Published Sun, May 21 2023 5:26 AM | Last Updated on Sun, May 21 2023 7:25 AM

Moderate rains for next 3 days in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే మూడ్రోజులు రాష్ట్రం­లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలిక­పాటి వర్షాలు కురుస్తాయని వాతావ­రణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బిహార్‌ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్‌గఢ్‌ మీ­దుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్‌ తెలి­పారు.

తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూ­లు, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగు­లతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక సోమవారం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు  కురుస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement