సాయికృష్ణ కేసు: హైకోర్టు విచారణ వేళ రాజకీయ మల్లగుల్లాలు | Political Row Deepens Over Sai Krishna Lockup Death Case Ahead Of High Court Hearing | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసు: హైకోర్టు విచారణ వేళ రాజకీయ మల్లగుల్లాలు

Jun 29 2026 9:03 AM | Updated on Jun 29 2026 9:58 AM

saikrishna lockup death case political drama before high court hearing

కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు 

 ఉపసంహరణకు ఓ పచ్చనేత యత్నాలు 

 నేడు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో సిట్‌ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్‌కు సంబంధించి కీలకమైన ‘హెబియస్‌ కార్పస్‌’ పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. 

ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్‌ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement