అనంతపురం: ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయించాలని కోరిన నలుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీకి బాహాటంగా మద్దతు ప్రకటించే ఉపాధ్యాయుల జోలికి విద్యాశాఖ అధికారులు వెళ్లలేదు.
ఇటీవల టీడీపీ నేతలతో కలిసి వేదిక పంచుకున్నారు ఉపాధ్యాయ సంఘం నేతలు శ్రీనివాసరాజు, సాంబశివారెడ్డి, చంద్రశేఖర్. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ రాజకీయ ప్రసంగాలు చేశారు ఆయా ఉపాధ్యాయులు. టీడీపీకి మద్దతు ఇచ్చే ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తున్న టీచర్స్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మంత్రి నారా లోకేశ్ ఏకపక్ష వైఖరిపై ఉద్యమానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నారు.


