breaking news
Gade Sai Krishna Case
-
మూడవరోజు CI నాగరాజు కస్టడీ విచారణలో షాకింగ్ నిజాలు
-
CI నాగరాజుకు రెండో రోజు SIT విచారణ.. మరో కీలక పరిణామం
-
సాయి కృష్ణ కేసులో ట్విస్ట్..? తల్లికి తెలియకుండానే పిటిషన్
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్... A1గా డీజీపీ, A2గా సీపీ రాజశేఖర్..?
-
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
-
సాయికృష్ణ లాకప్‌డెత్ కథ కంచికే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది! సాయికృష్ణ చనిపోయిన తేదీ, కనీసం బూడిద ఆనవాళ్లు కూడా లేకుండానే కుటుంబ సభ్యులు విజయవాడ కృష్ణలంకలోని సత్యంగారి దొడ్డిలో ఆదివారం కర్మకాండలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరు కావడం గమనార్హం. చనిపోయిన మూడు నెలల్లోగా పెద్ద కర్మ నిర్వహించకుంటే తమ కుటుంబానికి కీడు కలుగుతుందని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని బంధువులు తెలిపారు.అయితే తెరవెనుక ఈ కేసును నీరు గార్చే కుట్రలు దాగి ఉన్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన సిట్ సైతం సాయికృష్ణది లాకప్ డెత్ అని నిర్ధారించినా ఎప్పుడు చనిపోయాడు? శవం ఏమైంది? అనే విషయాలను ఇప్పటికీ తేల్చలేదని గుర్తు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టుల్లో పిటీషన్లు వేస్తూ కాలయాపన చేయడం మినహా సాధించింది శూన్యమంటున్నారు. తూతూ మంత్రంగా విచారణ.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. రోజులు గడిచిపోతున్నా అడుగు ముందుకు పడటం లేదు. ప్రధాన నిందితుడు నాగరాజు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్ అరెస్టు మినహా కేసులో పురోగతి లేదు. నాగరాజు కస్టడీపై విచారణ ఆగస్టు 14కు వాయిదా పడింది. సీసీ ఫుటేజీ రికవరీకి సంబంధించి పిటిషన్ల విచారణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ కేసును పక్కా ప్రణాళికతో నీరుగార్చే కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.తొలుత సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 18న ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ప్రభుత్వం తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంకావడంతో ఐజీ నేతృత్వలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సిట్ దర్యాప్తు సాగదీత దిశగానే సాగుతోంది. పోలీసు స్టేషన్ టెర్రస్‌పై బూడిద, ఎముకలు, సగం కాలిన లాఠీ, గొలుసు లభించాయని కస్టడీ పిటిషన్లో పేర్కొంది.అవి సాయికృష్ణవేనా? అనే విషయాన్ని తేల్చలేదు. ఇక సాయికృష్ణ ఫోన్‌ను గోవాకు తీసుకెళ్లినట్లు లీకులు ఇచ్చారు. ఈ కేసులో ఏ4 ఎవరు? అనే విషయాన్ని వెల్లడించలేదు. ఒకవైపు ఇలా తీరుతెన్ను లేకుండా దర్యాప్తు జరుగుతుండగా... మరోవైపు బూడిద కూడా లేకుండానే మృతుడి కుటుంబ సభ్యులు పెద్దకర్మ చేయడంతో సాయికృష్ణ కథ కంచికి చేరినట్లేననే పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఖాకీలా.. యమకింకరులా? పోలీసుల దాష్టీకానికి 2 నెలల్లో ఏడుగురు బలి
-
సాయి కృష్ణ కేసుపై తల్లి వెనకడుగు అడ్వకేట్ సంచలన వ్యాఖ్యలు
-
సాయికృష్ణ కేసులో లాయర్ల మార్పు పిటిషన్ తిరస్కరణ
-
సాయికృష్ణ కేసులో లాయర్ల మార్పు తిరస్కరణ
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కస్టడీ మరణం/అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తరఫున దాఖలైన పిటిషన్లో న్యాయవాదులను మార్చాలని చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే కేసులో వాదిస్తున్న న్యాయవాదుల నుంచి 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC)' లేకుండా కొత్త న్యాయవాదులను అనుమతించడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.సాయికృష్ణ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని భద్రపరచి రికార్డులను సంరక్షించాలని కోరుతూ మానవ హక్కుల కమిటీ తరఫున ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. అయితే, ఆ కేసులో ఇకపై మానవ హక్కుల కమిటీ న్యాయవాదుల స్థానంలో ఇతర న్యాయవాదులు వాదిస్తారని విజయలక్ష్మి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఇప్పటికే కేసులో ఉన్న మానవ హక్కుల కమిటీ న్యాయవాదులను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అలాగే, వారి నుంచి ఎన్ఓసీ లేకుండానే కొత్త పిటిషన్ ఎలా దాఖలు చేశారని నిలదీసింది. మానవ హక్కుల కమిటీ న్యాయవాది ఎన్ఓసీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని విజయలక్ష్మి సోదరి కనకదుర్గ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, విజయలక్ష్మి తమను ఎప్పుడూ ఎన్ఓసీ కోరలేదని మానవ హక్కుల కమిటీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.ఈ నేపథ్యంలో ఎన్ఓసీ లేకుండా న్యాయవాదుల మార్పును అనుమతించలేమని స్పష్టం చేసిన కోర్టు, సంబంధిత పిటిషన్‌ను తిరస్కరించింది. అలాగే ఈ వ్యవహారంపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ, ఆ రోజున సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. -
‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్‌డెత్‌లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్‌తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
SITకు హైకోర్టు చిన్న అవకాశం సీల్డ్ కవర్ లో ఆధారాలు
-
చంద్రబాబుకు నేను చెప్పేది ఇదే చాలా ప్రమాదకరం...
-
సాయికృష్ణ కేసులో నీకెందుకంత ఆసక్తి? డీజీపీని ఎందుకు కాపాడుతున్నావ్? గుట్టు విప్పిన జగన్!
-
నేను అమరావతికి వెళ్లలేక కాదు వెళ్తే జరిగేది ఇది అందుకే... బాబుని ఇచ్చిపడేసిన జగన్
-
బెజవాడ బాస్ భారీ డీల్!
సాక్షి, అమరావతి: విజయవాడ పోలీస్ బాస్ రూటే సెప‘రేటు’. కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ లాకప్‌లోనే మాయం చేసిన దారుణం రాష్ట్రాన్నే నివ్వెరపరచగా.. మరోవైపు పోలీసు బాస్ అక్రమాలు మరింతగా బట్టబయలవుతున్నాయి. రూ.300 కోట్ల అక్రమ డిపాజిట్లతో ఖాతాదారులను బురిడీ కొట్టించిన ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థకు అనుకూలంగా ఆయన కథ నడిపించిన తీరు అధికారిక వైట్ కాలర్ నేరాన్ని తలపిస్తోంది. సీఐడీ, ఈడీల కళ్లు గప్పేందుకు ఆ కేసును నీరుగార్చిన తీరు.., ఆ సంస్థ మేనేజ్మెంట్తో భారీ డీల్ కుదుర్చుకున్న వైనం విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్ కుట్రల కేసులను దర్యాప్తు చేస్తున్న సమయంలోనే విజయవాడ కేంద్రంగా భారీ దందాలకు పాల్పడాలన్నది ఆయన ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ డీల్ కథా కమామిషు ఇదిగో ఇదీ..రూ.300 కోట్ల అక్రమ డిపాజిట్ల దందాఅద్వైక ట్రేడింగ్ కంపెనీ విజయవాడ కేంద్రంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి దాదాపు 1,500 మంది ఖాతాదారుల నుంచి రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసి, వారిని బురిడీ కొట్టించింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 70 మందికి పైగా ఏజంట్లను నియమించుకుని డిపాజిట్లు సేకరించింది. అనంతరం వడ్డీలు చెల్లించడం నిలిపివేసింది. దీనిపై ఖాతాదారులు ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఓ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో కంపెనీపై గత ఏడాది జూన్‌లో కేసు నమోదు చేశారు. మోసపోయిన ఖాతాదారులు దాదాపు 1,500 మంది విజయవాడ పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నారు. డిపాజిట్ పత్రాలు, ఇతర ఆధారాలు సమర్పించారు. దాంతో ఈ కేసుపై విజయవాడ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి డిపాజిటర్లకు న్యాయం చేస్తారని అంతా భావించారు. అదే సమయంలో పోలీస్ బాస్ రంగంలోకి దిగారు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులను పిలిపించారు. కేసు సమగ్రంగా విచారిస్తే అక్రమ డిపాజిట్లు మొత్తం వెనక్కి ఇవ్వాల్సి రావడంతోపాటు.. తీవ్ర శిక్ష పడుతుందని తనదైన శైలిలో బెదిరించారు. తన డీల్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అందుకు యాజమాన్య ప్రతినిధులు సమ్మతించినట్టు సమాచారం. దాంతో పోలీస్ బాస్ చకచకా పావులు కదిపారు.రూ.300 కోట్ల మోసం.. రూ.53 లక్షల కేసు1,500 మంది నుంచి రూ.300 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన ఈ ఆర్థిక మోసం కేసును నిబంధనల ప్రకారం సీఐడీ దర్యాప్తు చేయాలి. మార్గదర్శి చిట్‌ఫండ్స్, అగ్రిగోల్డ్ కేసులను సీఐడీనే విచారించింది. కేసు వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించాలి. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. కానీ ఈ కేసును సీఐడీ పరిధిలోకి, ఈడీ దృష్టికి వెళ్లకుండా పోలీస్ బాస్ కనికట్టు చేశారు. అందుకే ఒక్క ఖాతాదారుడు ఇచ్చిన ఫిర్యాదుకే పరిమితమై.. ఈ కేసును కేవలం రూ.53 లక్షల మోసానికే పరిమితం చేశారు. మిగిలిన 1,500 మంది ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇలా ఈ కేసు విజయవాడ పోలీసుల పరిధి దాటిపోకుండా అడ్డుకట్ట వేశారు. బాసే కేసును గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇందుకోసం ఆ కంపెనీ మేనేజ్మెంట్తో భారీ డీల్ కుదుర్చుకుని కేసును మసిపూసి మారేడు కాయ చేసేశారు. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు మళ్లింపుటాస్క్ఫోర్స్ విభాగంలోని తనకు అనుకూలమైన అధికారులతో కలిసి పోలీస్ బాస్ ఈ దందాలో రెండో అంకానికి తెరతీశారు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ 70 మంది ఏజంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించగా, కేసును 9 మందికే పరిమితం చేశారు. కేవలం ఒక్క మేనేజర్‌ను నిందితుడిగా చేర్చారు. అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన కంపెనీ యాజమాన్యాన్ని కేసు నుంచి తప్పించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద భాగాన్నే డీల్ మొత్తంగా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఆ మొత్తాన్ని కూడా చట్టం కళ్లుగప్పి తమ ఖాతాలో పడేట్టు చేసుకున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరిచి, అందులోకి డీల్ మొత్తాన్ని దశలవారీగా డిపాజిట్ చేయించినట్టు తెలుస్తోంది. దీనిని టాస్క్‌ఫోర్స్ విభాగంలో ఇద్దరు అధికారులు పర్యవేక్షించినట్ల సమాచారం. మోసపోయిన డిపాజిట్‌దారుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా అద్వైక ట్రేడింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకుని కేసును నీరుగార్చిన తీరు విస్మయపరుస్తోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘చంద్రబాబుకు అమరాతి ట్రిపుల్ ఏటీఎం’
గుంటూరు: చంద్రబాబు అమరావతి ట్రిపుల్ ఏటీఎంలా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిపై చంద్రబాబు రూ.47వేల కోట్లు అప్పు చేశారు. రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గూండాల దుశ్చర్య రాష్ట్రమంతా చూసింది. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల్నివేధిస్తున్నారు. రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లను మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఏమైనా పాకిస్థానా?!.పోలీసులు, టీడీపీ దుష్టశక్తులు దాడికి బాధ్యత వహించాలి. టీడీపీ గూండాల చేతుల్లో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్ చెబితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు బయపడతారని అనుకుంటారా?.భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు వైఎస్ జగన్ కలిశారు. రైతులకోసం మేం వస్తే రాళ్ళు, కోడిగుడ్లతో టీడీపీకి చెందిన వాళ్లు దాడికి దిగారు. మేం బాధితులమైతే మాపైనే కేసులు పెట్టారు.బాధితులే నిందితున్నారు.నా ఇంటిపై దాడి జరిగింది... నాపైనే కేసు పెట్టారు.మీరు దౌర్జన్యం చేస్తే భయపడతామా... రైతులకోసం పోరాడతాం.మూడు పంటలు పండే భూములు తీసుకోవాలనుకుంటున్నారు. అమరావతి వ్యవహారంలో పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. చదరపు అడుగు నిర్మాణానికి 20వేలు ఇస్తున్నారు.ఉండవల్లి,పెనుమాక, కురగల్లు, యర్రబాలెం రైతులు మేం రమ్మంటేనే వచ్చామని చెప్పారు.విధి నిర్వహణలో ఉన్న పోలీసుకు గాయమైతే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఎందుకింత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని రిమాండ్ కు పంపించాలని పెద్ద కేసులు పెడుతున్నారు.సాయికృష్ణ లాకప్ డెత్ అంతులేని కథ.సిట్ విచారణ చేసి సీఐ నాగరాజును అరెస్టు చేశారు.రిమాండ్ రిపోర్టు చూస్తే సమాధానం లేని అనేక ప్రశ్నలు ఉన్నాయి.సీసీ ఫుటేజ్ కనిపించడంలేదన్నారు.చంపడంతోపాటు సాక్షాధారాలు లేకుండా చేశారు. టెక్నాలజీ గురించి చంద్రబాబు మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైతే కమాండ్ కంట్రోల్ రూం, డీజీపీ ఆఫీసులో ఉండదా. మే 28న సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ ఘటనపై కలవాలని సిట్ చీఫ్ రవిప్రకాష్‌ను కోరాం.సిట్ దర్యాప్తు లోపభూఇష్టంగా జరుగుతుందని సిట్ అధికారికి ఫిర్యాదు చేశాను.సీఐ నాగరాజును బలిచెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. నాగరాజుతోపాటు అనేకమంది పైస్థాయి అధికారులు ఇందులో ఉన్నారు. సీఐ నాగరాజు సాయికృష్ణను చంపడానికి కారణం ఏంటో సిట్ చెప్పలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఒక్కటే చెబుతున్నా. యుద్ధంలో ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. సాయికృష్ణ బాడీ అప్పగించకుండా బూడిద చెయ్యడం మానవత్వమేనా. విజయలక్ష్మి ఉసురు మీకు తగులుతుంది’ అని హెచ్చరించారు. -
సాయికృష్ణ కేసు.. సిట్ అదుపులో సీఐ సన్నిహితుడు సురేష్
సాక్షి, విజయవాడ: విజయవాడలో సంచలనంగా మారిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నాగరాజుకు సన్నిహితుడైన సురేష్.. సిట్ అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో సురేష్‌ను సిట్ అధికారులు విచారించనున్నట్టు సమాచారం. సురేష్ వద్ద నుండి కీలక సమాచారం రాబట్టే దిశగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సాయికృష్ణ లాక్అప్ డెత్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది.మరోవైపు.. ఈ ఘటనపై అనేక కోణాల్లో విచారణ కొనసాగిస్తున్న సిట్.. కేసులో కీలకంగా భావిస్తున్న పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిట్, అనుమానితుల కోసం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు కూడా బృందాలను పంపింది. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అశోక్, నాని ఇళ్లకు వెళ్లి సిట్ సిబ్బంది నోటీసులు అందజేసినట్లు సమాచారం. అదేవిధంగా, పరారీలో ఉన్న నిందితులు తమ కుటుంబ సభ్యులతో వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని సిట్ అనుమానిస్తోంది. ఈ డిజిటల్ ఆధారాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.విజయలక్ష్మి న్యాయ పోరాటం.. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో అతడి తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్న విజయలక్ష్మి తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. తన కుమారుడి లాకప్‌డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా న్యాయస్థానం సరైనదని భావించే మరేదైనా ఇతర సమర్థవంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యర్థిస్తూ ఆమె హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.ఈ స్వతంత్ర దర్యాప్తు కేవలం ఆ సంస్థ పరిధిలోనే కాకుండా పూర్తి స్థాయిలో కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేలా చూడాలని ఆమె హైకోర్టుకు విన్నవించారు. సాయికృష్ణ ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎటువంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ సుభేందు శమంతో ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. -
ఇది పక్కా ప్లాన్ మర్డర్... వాళ్లందరికీ ఉరిశిక్ష పడేవరకు పోరాడుతాం
-
కృష్ణలంక CCTV ఫుటేజ్ ఎలా మిస్సయిందంటే..? అడ్వకేట్ షాకింగ్ నిజాలు..
-
సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజుకు తోడైన ముగ్గురు కిరాతకులు వీళ్లే!
సాక్షి,విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో సిట్ అధికారులు కీలక విషయాలను వెలికితీశారు. సీఐ నాగరాజు అరెస్ట్ అనంతరం ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ జరిపిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, అలాగే ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా సహకరించినట్లు సిట్ నివేదిక స్పష్టం చేస్తోంది.సీఐ నాగరాజు అరెస్ట్ అయిన వెంటనే హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానిలతో పాటు సీఐ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఐ అసిస్టెంట్‌గా హెడ్ కానిస్టేబుల్ అశోక్ వ్యవహరించగా.. మరో హెడ్ కానిస్టేబుల్ నాని సీఐ పేరు చెప్పుకుని ప్రైవేట్ సెటిల్మెంట్లు, దందాలు నడపడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది.గతంలో గన్నవరం, పటమట పోలీస్ స్టేషన్లలో పని చేసినప్పుడు నానిపై అనేక ఆరోపణలు రావడంతో అతడిని వీఆర్‌కు పంపారు. అయితే, ఇటీవలే మళ్లీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. సీఐ సన్నిహితుడైన సురేష్.. సాయికృష్ణ మృతదేహాన్ని లొకేషన్ నుండి మాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.గత నెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను ఒక సెటిల్మెంట్ విషయమై సురేష్ పిలిచాడు. ఆ తర్వాత సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలు కలిసి ఒక నల్లటి రంగు వాహనంలో వడ్డేశ్వరంలోని నవరంగ్ ఇంటికి వెళ్లారు. నవరంగ్ ఇంటికి వెళ్లి వారు చేసిన హడావుడి, బెదిరింపుల అంశాన్ని సాయికృష్ణ మేనమామ నవరంగ్ స్వయంగా సిట్ అధికారుల విచారణలో వెల్లడించారు.సాయికృష్ణ మృతదేహాన్ని దాచడంలో లేదా వేరే చోటికి తరలించడంలో ఈ ముగ్గురూ సీఐ నాగరాజుతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, ప్రైవేట్ వ్యక్తి సురేష్‌ల కోసం సిట్ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. -
పోలీసు బాస్‌లకు తెలిసే సీసీ టీవీ ఫుటేజీ మాయం
సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం, కనుమరుగు వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ మాయం కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు పెద్దల సహాయ, సహకారాలు లేకుండా సీసీ టీవీ ఫుటేజీ మాయం అయ్యే అవకాశమే లేదు. చట్ట నిబంధనల ప్రకారం సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేయాలంటే జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్లలో కమిషనర్ అనుమతి తప్పనిసరి. వీరి అనుమతి లేకుండా పోలీస్స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాని పని. ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)కు కూడా సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేసేందుకు అనుమతి ఉండదు. డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్), నెట్వర్క్ వీడియో రికార్డర్ (ఎన్వీఆర్)లలో నిక్షిప్తమయ్యే సీసీ టీవీ ఫుటేజీని తొలగించాలంటే ఎస్పీ లేదా కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. వారు నేరుగా పోలీసులకు అనుమతి ఇవ్వరు. సదరు సీసీ టీవీ ఫుటేజీని తెరిచేందుకు ఓ అధీకృత వ్యక్తిని నియమిస్తారు. ఆ వ్యక్తికి మాత్రమే దానిని పరిశీలించే, డిలీట్ చేసే అధికారం ఉంటుంది. అనుమతులు లేకుండా పోలీసులు నేరుగా సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేయడం చట్టరీత్యా తీవ్ర నేరం. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లేదా ఐపీసీ సెక్షన్ల ప్రకారం, కేసు దర్యాప్తుకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా తొలగించడం అనేది నాన్ బెయిలబుల్ నేరం. ఫుటేజ్ డిలీట్ చేసినట్లు రుజువైతే సదరు పోలీసు అధికారులను సర్వీస్ నుండి సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడంతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.ఆ ఫుటేజీని తిరిగి పొందడం సాధ్యమే వాస్తవానికి పోలీస్స్టేషన్లలోని సీసీ టీవీ ఫుటేజీ కేవలం ఆ స్టేషన్‌లోని డీవీఆర్‌లో మాత్రమే కాక, మరో రెండు చోట్ల భౌతికంగా రికార్డ్ చేయడం తప్పనిసరి. ఓ చోట ఫుటేజీ పోయినా మరో చోట నుంచి ఫుటేజీని తీసుకునేందుకే ఇలాంటి ఏర్పాటు చేశారు. సాయికృష్ణ కేసులో మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల సీసీ టీవీ ఫుటేజీ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించారు. అసలు వాస్తవాలు వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశంతోనే సీసీ టీవీ ఫుటేజీని పోలీసు పెద్దల ఆదేశాల మేరకు తొలగించినట్లు పోలీసు అధికారులే చెబుతున్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా నెల రోజుల సీసీ టీవీ ఫుటేజీ డిలీట్ అయ్యిందంటే కమిషనర్‌కు తెలియకుండా ఉండే అవకాశం లేదన్నది రిటైర్డ్ పోలీసు అధికారుల మాట. ఇటీవల ఓ కోర్టు ధిక్కార కేసు, ఓ అక్రమ నిర్భంధం కేసులో సీసీ టీవీ ఫుటేజీ డిలీట్ వ్యవహారం హైకోర్టు ముందు చర్చకు వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేయాలంటే పోలీసులు నేరుగా చేయలేరని, జిల్లా ఎస్పీ లేదా కమిషనర్ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వమే స్వయంగా హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపితే అసలు సీసీ టీవీ ఫుటేజీని ఎవరు డిలీట్ చేశారు.. ఎప్పుడు చేశారు.. ఎంత మేర డిలీట్ చేశారనే వివరాలను సులువుగానే తెలుసుకోవచ్చు. డిలీట్ చేసిన ఫుటేజీని తిరిగి పొందడం కూడా సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు.లాకప్‌డెత్‌ల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ⇒ దేశంలో పోలీసులు పౌరుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుండటం, అక్రమంగా నిర్బంధించడం, లాకప్‌డెత్‌లు ఎక్కువైపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పరంవీర్ సింగ్ సైనీ వర్సెస్ బల్జీత్ సింగ్’ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీల నిర్వహణపై అత్యంత కఠినమైన ఆదేశాలిచ్చింది.⇒ నిందితులను, అనుమానితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వారి పట్ల దారుణంగా, క్రూరంగా ప్రవర్తించినప్పుడు పోలీసులు ‘అక్కడ సీసీ టీవీ పనిచేయడం లేదు‘ లేదా ‘ఆ సమయానికి పవర్ కట్ అయింది‘ అని సాకులు చెబుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో పోలీసులకు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయ్యే ఆడియో, వీడియో డేటాను కనీసం 12 నుండి 18 నెలల పాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. ⇒ కేవలం వీడియో మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్లలో జరిగే ప్రతి సంభాషణ రికార్డ్ అయ్యేలా ఆడియో సిస్టమ్, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా నైట్ విజన్ కెమెరాలు ఉండాలి. సీసీటీవీల పర్యవేక్షణ కేవలం ఆయా పోలీస్ స్టేషన్ల చేతుల్లోనే ఉండదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన ’స్వతంత్ర కమిటీలు’ ఈ కెమెరాల పని తీరును, ఫుటేజ్‌లను నిరంతరం ఆడిట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ఫుటేజ్ డిలీట్ చేసినా, నేటి ఆధునిక సాంకేతికత ముందు వారు దొరికిపోవడం ఖాయం. ⇒ ఎందుకంటే ఆధునిక సిస్టమ్స్‌లో ఆటోమేటిక్ ‘ఆడిట్ లాగ్’ రికార్డ్ అవుతుంది. అంటే, ఏ యూజర్ ఐడీ ద్వారా, ఏ తేదీన, ఏ సమయంలో లాగిన్ అయ్యారు? ఏ ఫైల్‌ను డిలీట్ చేశారు? అనే సమాచారం సిస్టమ్ లోపల నమోదవుతుంది. దీనిని పోలీసులు కూడా మార్చలేరు. హార్డ్ డిస్క్ నుండి డిలీట్ చేసిన లేదా ఫార్మాట్ చేసిన డేటాను పూర్తిగా తుడిచి పెట్టడం అంత సులువు కాదు. ⇒ కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సదరు డివైజ్‌లను సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపితే, నిపుణులు డిలీట్ చేసిన ఫుటేజ్‌ను మళ్లీ విజయవంతంగా రికవరీ చేయగలరు. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్‌ను నేరుగా డిలీట్ చేసే భౌతిక అవకాశం పోలీసులకు కొంత మేర ఉన్నప్పటికీ.. చట్టపరమైన నిబంధనలు, డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నాలజీ, కోర్టుల నిరంతర పర్యవేక్షణ కారణంగా అలా చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.సీసీటీవీ కెమెరా పనిచేయకపోతే కమిటీకి చెప్పాల్సిందే ⇒ ఒకవేళ పోలీస్ స్టేషన్లో కెమెరా పని చేయకపోతే, ఆ విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంటనే జిల్లా స్థాయి కమిటీకి లిఖిత పూర్వకంగా నివేదించాల్సి ఉంటుంది. లాకప్‌లో అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పౌరుల హక్కులకు రక్షణ కల్పిస్తున్నాయి. సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ‘ఫైల్ కార్వింగ్‘ అనే పద్ధతి ద్వారా తొలగించిన ఫుటేజీని యథావిధిగా బయటకు తీస్తారు. ⇒ ప్రతి ఆధునిక సీసీటీవీ సాఫ్ట్వేర్ వెనుక ఒక రహస్య డైరీ లాంటిది రన్ అవుతుంది. దీన్నే ’ఆడిట్ లాగ్’ అంటారు. ఒక అధికారి ఫుటేజ్ డిలీట్ చేస్తే, అది లాగ్ ఫైల్లో రికార్డ్ అయిపోతుంది. దీనిని సాధారణ యూజర్లు మార్చలేరు. దర్యాప్తు అధికారులు ఈ లాగ్‌ను పరిశీలించి, ‘ఫలానా సమయంలో, ఫలానా ఐడీతో ఫుటేజ్ డిలీట్ చేశారు‘ అని తేలుస్తారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్ సీసీ టీవీలను కేవలం ఆ స్టేషన్‌కే పరిమితం చేయడం లేదు. ⇒ స్టేషన్‌లోని కెమెరాల లైవ్ ఫీడ్ నేరుగా జిల్లా ఎస్పీ ఆఫీస్‌కు లేదా స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ లోకల్ స్టేషన్లో పోలీసులు డీవీఆర్‌ను పగలగొట్టినా లేక సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేసినా, మెయిన్ హెడ్‌క్వార్టర్స్ సర్వర్‌లో ఆ డేటా సురక్షితంగా బ్యాకప్ అయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కెమెరా వైర్లు పీకేయాలని చూసినా, లేదా కెమెరా ముందు ఏదైనా అడ్డం పెట్టాలని ప్రయత్నించినా, సిస్టమ్ వెంటనే మెయిన్ కమాండ్ సెంటర్‌కు అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. దీనివల్ల ‘కెమెరా ఆటోమేటిక్‌గా పాడైపోయింది‘ అని పోలీసులు అబద్దాలు చెప్పేందుకు ఆస్కారం ఉండదు. -
సాయికృష్ణ కేసు విచారణలో ఫుల్ రిపోర్ట్ ఇదే..!
-
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం
-
పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్
-
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
-
రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు.. సీఐ నాగరాజు దొరికిపోయింది ఇలాగే..!
-
నాగరాజు కేసులో సిట్ దూకుడు.. ACM కోర్టులో పిటిషన్
-
‘సాయికృష్ణ కేసుపై కొత్త డ్రామా.. సెకండ్ హాఫ్ దద్దరిల్లుతుంది’
సాక్షి, విశాఖపట్నం: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనపై కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటూ మండిపడ్డారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక సీఐ చేసిన చర్యగా చూపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ కేసుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ హత్యకు సీఎం చంద్రబాబు కులాలను ఆపాదిస్తున్నారు. చనిపోయిన వాడు కాపు, చంపినవాడు కాపునే అని మాట్లాడుతున్నారు. కులాన్ని ఆపాదించి రాజకీయం చేయాలని చూస్తున్నారు. జరిగిన హత్య నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో సాయికృష్ణ లాంటి హత్య ఎక్కడ జరిగి ఉండదు. హెబియస్ కార్పస్ రిట్ వేస్తే సాయికృష చనిపోయారని చెబుతున్నారు. సాయికృష కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తే సాయికృష్ణ క్రిమినల్ అని విమర్శలు చేశారు. అదే సాయికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శిస్తే ఆ వ్యక్తి ఏమవుతారో బాబే సమాధానం చెప్పాలి.సాయికృష్ణ హత్య ప్రభుత్వ హత్య. ఇది ఒక సీఐ చేసిన హత్య కాదు. డీజీపీ, డీజీ, ఏసీపీ అందరినీ అరెస్ట్ చేయాలి. సిట్ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు రావు. సీబీఐతో విచారణ జరగాలి. పోలీసులు చట్టానికి లోబడి పని చేయండి. రేపటి రోజున మిమ్మల్ని కాపాడేందుకు చంద్రబాబు, లోకేష్ రారు. కూటమి రెండున్నర ఏళ్ళు సినిమాకు ఇంటర్వెల్ పడింది. మిగతా రెండున్నర ఏళ్ల సినిమా దద్దరిల్లిపోతుంది. ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్ నెట్ కాదు. వైఎస్సార్సీపీ ముందు చంద్రబాబు డ్రామాలు చెల్లవు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు గుడ్డు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. కాపుల సమస్యలపై సమావేశం పెట్టుకుంటే పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా సమావేశమయ్యారు అని రాస్తున్నారు. హోంశాఖ సరిగా పనిచేయలేదని పవన్ చెప్పారు. సాయికృష్ణ హత్య నుంచి ప్రజల దృష్టి మార్చడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. -
కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు
-
76 ఏళ్లు వచ్చాయి... సిగ్గులేదు! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
రాజమండ్రి జైలుకు CI నాగరాజు
-
సాయి కృష్ణ కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు
-
నాగరాజు సైలెన్స్.. మరింత పెరుగుతున్న అనుమానాలు!
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో అరెస్టయిన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు గంటల తరబడి విచారించినప్పటికీ.. కీలక ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. కేసులోని ప్రధాన అంశాలపై అడిగిన ప్రశ్నలకు మౌనం పాటించినట్లు తెలుస్తోంది. అయితే అదీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకేనా? అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.విచారణ సందర్భంగా నాగరాజు చాలా ప్రశ్నలకు స్పందించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. సిట్ దర్యాప్తులో భాగంగా ఉన్నతస్థాయి అధికారులు నేరుగా ప్రశ్నించినా నాగరాజు నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సాయి కృష్ణ కస్టడీ, ఆచూకీ, సీసీటీవీ ఫుటేజీలకు సంబంధించిన ప్రశ్నల వద్ద ఆయన మౌనం మరింత అనుమానాలకు తావిస్తోంది.ఎందుకు తీసుకొచ్చారు?నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) అమలులో భాగంగా సాయి కృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తీసుకొచ్చిన పోలీసు బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజుకు అప్పగించినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. అతడిని కోర్టులో హాజరుపరిచారా? లేక స్టేషన్లోనే ఉంచారా? అన్న అంశంపై స్పష్టత రావడం లేదు. న్యాయ ప్రక్రియ ప్రకారం కోర్టులో హాజరుపర్చాల్సిన వ్యక్తి ఆ తర్వాత ఎలా అదృశ్యమయ్యాడన్నది దర్యాప్తులో కీలక అంశంగా మారింది. వారెంట్ అమలు పేరుతో అదుపులోకి తీసుకొచ్చిన సాయి కృష్ణను కోర్టుకు తీసుకెళ్లకుండా ఏం చేశారన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లభించలేదు. ఇదే అంశంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి?కేసులో అత్యంత కీలకంగా మారిన అంశం సీసీటీవీ ఫుటేజీలు. సాయికృష్ణ స్టేషన్లో ఉన్న సమయంలో నమోదైన ఫుటేజీలు ఎందుకు తొలగించబడ్డాయి? వాటిని ఎవరు డిలీట్ చేశారు? అనే ప్రశ్నలకు ఇంకా జవాబులు లభించలేదు. ఈ అంశంపై నాగరాజును సిట్ అధికారులు పదేపదే ప్రశ్నించినట్లు సమాచారం.లాకప్‌లో కొట్టారా?సాయికృష్ణను స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. లాకప్‌లో జరిగిన దాడుల వల్లే అతడు మరణించాడా? అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే దీనిపై నాగరాజు ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ సాయి కృష్ణ మరణించి ఉంటే.. మృతదేహం ఏమైంది? దానిని ఎక్కడికి తరలించారు? ఏమైనా రికార్డులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు కేసులో అత్యంత కీలకంగా మారాయి. శ్మశానవాటికలో జరిగిన విచారణ కూడా ఇదే కోణంలో కొనసాగింది.సమాచారం ఎవరికిచ్చారు?కస్టడీలో ఉన్న వ్యక్తికి ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం జరిగినా ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సాయి కృష్ణ మరణించి ఉంటే ఆ విషయాన్ని అప్పటి ఉన్నతాధికారులకు తెలియజేశారా? లేదా? అన్న అంశంపైనా సిట్ సమాధానాలు వెతుకుతోంది.ప్రశ్నలే ఎక్కువ..!నాగరాజు అరెస్టు తర్వాత కేసు వేగం పుంజుకున్నప్పటికీ.. ఇప్పటివరకు సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ నిజంగా ఏమయ్యాడు? కస్టడీలో ఏం జరిగింది? సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు మాయమయ్యాయి? అన్న ప్రశ్నలకు దర్యాప్తు తుది సమాధానం చెబుతుందా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. -
CI నాగరాజు కాలర్ ఎగరేసుకొని...! సాయి కృష్ణ కేసులో కూటమి కుట్ర
-
సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్..! నాగరాజును కాపాడేది వీళ్లే..!
-
పోలీసులు ఈ చిన్న లాజిక్‌ను మిస్సయ్యారు సాయి కృష్ణ కేసులో దృశ్యం సీన్ రిపీట్..!
-
CI నాగరాజు అరెస్ట్..
-
CI నాగరాజును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం ప్రశ్నలు అడగనున్నారు.?
-
పోలీసులు అదుపులోకి తీసుకున్నా నోరు విప్పని సీఐ నాగరాజు
-
సాయి కృష్ణ కేసుపై బాబును ప్రశ్నించిన జగన్
-
CI నాగరాజు ఇంటి వద్ద హైటెన్షన్
-
కృష్ణలంక సీసీ ఫుటేజ్ మాయం CI నాగరాజు చేసిన పెద్ద మిస్టేక్
-
CCTV ఫుటేజ్ మాయం చేసింది CI నాగరాజు కాదు అంబటి సంచలన నిజాలు
-
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. శ్మశాన వాటికలో పోలీసుల విచారణ
-
జడ శ్రవణ్ అన్నట్టు ఇది ప్రీ ప్లాన్ మర్డర్...అడ్వకేట్ బాల ఫైర్
-
అంతా అతని ఆధ్వర్యంలోనే జరిగింది! ఇది నిజం ..
-
సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు వెనక ఉన్నవారి సంగతేంటి?
సాక్షి, తాడేపల్లి: రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టినప్పుడే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పతనం అయ్యిందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి,మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయికృష్ణ కేసులో వరుస పరిణామాలపై పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది.పోలీసులు చంద్రబాబుకు ప్రయివేటు సైన్యంలా మారిపోయారు. పోలీసుల చేతిలో సాయికృష్ణ లాకప్ డెత్ అయితే నెల రోజులుగా ప్రభుత్వం ఏం చేస్తోంది?. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయికష్ణ నివాసానికి వెళ్తేగానీ ప్రభుత్వం స్పందించదా?. కేసును సీఐ నాగరాజుతో ముడిపెట్టి వదిలేస్తారా?. సీఐ నాగరాజు వెనుక ఉన్న మిగతా పోలీసు అధికారుల సంగతేంటి?. వారికి తెలియకుండానే లాకప్‌డెత్ చేసి శవాన్ని మాయం చేస్తారా?.రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టినప్పుడే పోలీసు వ్యవస్థ పతనం అయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లో అడుగు పెట్టే పరిస్థితే లేదు. పోలీసుల వైఖరికి ఇదే నిదర్శనం. దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య దారుణం. సీఐ నాగరాజు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు అధికారులు సీరియస్‌గా ఉంటే కిందిస్థాయిలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయా?’అని ప్రశ్నించారు. -
సాయికృష్ణ కేసులో కీలక మలుపు
సాక్షి,విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని విచారించారు. ఈ విచారణపై సమాచారం తెలుసుకున్న కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ దైవప్రసాద్... కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారిని పిలిపించుకున్నారు. ప్రస్తుతం కృష్ణలంక స్టేషన్లో ఏసీపీ దైవప్రసాద్తో పాటు ఆయన నేతృత్వంలోని ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బృందం లతాకుమారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


