‘చంద్రబాబుకు అమరాతి ట్రిపుల్‌ ఏటీఎం’ | Ambati Rambabu Fires On CM Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు అమరాతి ట్రిపుల్‌ ఏటీఎం’

Jun 28 2026 4:26 PM | Updated on Jun 28 2026 5:31 PM

Ambati Rambabu Fires On CM Chandrababu

గుంటూరు: చంద్రబాబు అమరావతి ట్రిపుల్‌ ఏటీఎంలా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిపై చంద్రబాబు రూ.47వేల కోట్లు అప్పు చేశారు. రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గూండాల దుశ్చర్య రాష్ట్రమంతా చూసింది. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల్నివేధిస్తున్నారు. రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లను మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఏమైనా పాకిస్థానా?!.పోలీసులు, టీడీపీ దుష్టశక్తులు దాడికి బాధ్యత వహించాలి. టీడీపీ గూండాల చేతుల్లో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్ చెబితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు బయపడతారని అనుకుంటారా?.

భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు  వైఎస్‌ జగన్‌ కలిశారు. రైతులకోసం మేం వస్తే రాళ్ళు, కోడిగుడ్లతో టీడీపీకి చెందిన వాళ్లు దాడికి దిగారు. మేం బాధితులమైతే మాపైనే కేసులు పెట్టారు.బాధితులే నిందితున్నారు.నా ఇంటిపై దాడి జరిగింది... నాపైనే కేసు పెట్టారు.మీరు దౌర్జన్యం చేస్తే భయపడతామా... రైతులకోసం పోరాడతాం.మూడు పంటలు పండే భూములు తీసుకోవాలనుకుంటున్నారు. అమరావతి వ్యవహారంలో పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. చదరపు అడుగు నిర్మాణానికి 20వేలు ఇస్తున్నారు.ఉండవల్లి,పెనుమాక, కురగల్లు, యర్రబాలెం రైతులు మేం రమ్మంటేనే వచ్చామని చెప్పారు.విధి నిర్వహణలో ఉన్న పోలీసుకు గాయమైతే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఎందుకింత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని రిమాండ్ కు పంపించాలని పెద్ద కేసులు పెడుతున్నారు.

సాయికృష్ణ లాకప్ డెత్ అంతులేని కథ.సిట్ విచారణ చేసి సీఐ నాగరాజును అరెస్టు చేశారు.రిమాండ్ రిపోర్టు చూస్తే సమాధానం లేని అనేక ప్రశ్నలు ఉన్నాయి.సీసీ  ఫుటేజ్ కనిపించడంలేదన్నారు.చంపడంతోపాటు సాక్షాధారాలు లేకుండా చేశారు. టెక్నాలజీ గురించి చంద్రబాబు మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైతే కమాండ్ కంట్రోల్ రూం, డీజీపీ ఆఫీసులో ఉండదా. మే 28న సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ ఘటనపై కలవాలని సిట్ చీఫ్ రవిప్రకాష్‌ను కోరాం.సిట్ దర్యాప్తు లోపభూఇష్టంగా జరుగుతుందని సిట్ అధికారికి ఫిర్యాదు చేశాను.

సీఐ నాగరాజును బలిచెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. నాగరాజుతోపాటు అనేకమంది పైస్థాయి అధికారులు ఇందులో ఉన్నారు. సీఐ నాగరాజు సాయికృష్ణను చంపడానికి కారణం ఏంటో సిట్ చెప్పలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఒక్కటే చెబుతున్నా. యుద్ధంలో ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. సాయికృష్ణ బాడీ అప్పగించకుండా  బూడిద చెయ్యడం మానవత్వమేనా. విజయలక్ష్మి ఉసురు మీకు తగులుతుంది’ అని హెచ్చరించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement