శుభాకాంక్షల ‘వర్షం’

శుభాకాంక్షల ‘వర్షం’ - Sakshi


సహ నటీనటులు, అభిమానుల శుభాకాంక్షలతో నటి త్రిష తడిసి ముద్దవుతున్నారు. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామకు మూడు పదులు దాటాయి. ఈ చెన్నై సుందరి తన జీవిత భాగస్వామిని వెతుక్కున్నారు. కాదూ, లేదూ, అంటూనే తాను పెళ్లి పీటలెక్కనున్న విషయాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంతకాలంగా యువ పారిశ్రామికవేత్త, నిర్మాత వరుణ్‌మణియన్‌తో ఖుషీగా షికార్లు కొడుతున్న ఈ బ్యూటీ ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఈ నెల 23న నిశ్చితార్థం జరగనుంది. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు సహ నటీనటులతోపాటు, ఇతర సాంకేతిక నిపుణులు, అభిమానులు త్రిషను శుభాకాంక్షలతో ముంచేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోష సాగరంలో తేలిపోతున్నారు త్రిష. ఆమెకు ఎవరెవరో ఎలా శుభాకాంక్షలు చెప్పారో చూద్దాం.

 

 ప్రియమణి : శుభాకాంక్షలు త్రిష

 

  శింబు : శుభాకాంక్షలు త్రిష. మీరు, వరుణ్ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.

 

 కార్తీక: 2015లో అధికారిక పూర్వకంగా ప్రకటించిన తొలి శుభవార్త ఇది. చాలా సంతోషంగా ఉంది. వరుణ్‌మణియన్‌తోపాటు పలువురి హృదయాల భగ్నానికి మీరే కారణం.

 

 కుష్భు : హృదయ పూర్వక శుభాకాంక్షలు త్రిష. మరింత ఆనందం పొందాలని కోరుకుంటున్నా.

 

 తిరు: మీ ఇరువురికి శుభాకాంక్షలు...జీ...

 

 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ : హే త్రిషా... శుభాకాంక్షలు. మెలోడీ డాన్సింగ్‌తో కూడిన శుభాకాంక్షలు.

 

 హన్సిక : ప్రేమ పూరిత శుభాకాంక్షలు. మీ నూతన ఆరంభానికి శుభాకాంక్షలు.

 

 రాధిక : శుభాకాంక్షలు త్రిష. మీకు వరుణ్‌మణియన్‌కు మంచి భవిష్యత్తు అమరాలని కోరుకుంటున్నా.

 

 ఛార్మి : ఓ..బేబీ శుభాకాంక్షలు. సంతోషంగా ఉంది. అంటూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు త్రిషకు శుభాభినందనాల వర్షం కురిపిస్తున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top