రెవెన్యూ క్లినిక్ అర్జీలపై ప్రత్యేక దృష్టి
జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ ద్వారా అందుతున్న అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి రెవెన్యూ క్లినిక్, పీజీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చారు.
మొత్తం 211 అర్జీలు..
పీజీఆర్‌ఎస్ నాన్ రెవెన్యూ కింద మొత్తం 136 అర్జీలు అందాయన్నారు. వీటితోపాటు రెవెన్యూ క్లినిక్ ద్వారా 75 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. విజయవాడ ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, తిరువూరు కె.మాధురి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..


