కోడూరుపాడు కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత
●వరుస మరణాలతో గ్రామస్తుల ఆగ్రహం
●కార్మికుడి మృతదేహంతో ఆందోళన
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త తత ఏర్పడింది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుల వరుస మరణాలు మిస్టరీగా మారాయి. ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న కెమికల్ వల్ల కార్మికులకు ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎ.సీతారామపురం గ్రామానికి చెందిన తాళ్లపూడి కాన్‌కుమార్ (30) మృతి చెందాడు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మి కుడిగా పని చేస్తున్న కాన్‌కుమార్‌కు ఏడాదిన్నర క్రితం అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉండ టంతో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందినా ఫలితం లేకుండాపో యింది. విజయవాడ ప్రభుత్వా స్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట కాన్‌కుమార్ మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజ మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషపూరిత రసాయనాలు తయారు చేస్తూ, అమాయక యువత ప్రాణాలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ.సీతారామపురం గ్రామానికి చెందిన తొమ్మి ది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పని చేయగా, ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడ్డా రని, మిగిలిన వారు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని వివరించారు. ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ బాధితుల పక్షాన ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణం వచ్చి, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో తయారవుతున్న కెమికల్స్‌పై సమ గ్ర విచారణ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న వీరవల్లి ఎస్‌ఐ సురేష్ ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత నష్టపరిహారం చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వటంతో బాధితులు ఆందోళన విరమించారు.


