జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఏడుకొండలరావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ అన్నవరపు వేంకటేశ్వరరావు శనివారం పదవీ విరమణ చేశారు. దీంతో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జీజీహెచ్‌కు పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించే వరకూ డాక్టర్ ఏడుకొండలరావు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
పాయకాపురం(విజయవాడరూరల్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సామాజిక భద్రతను కల్పిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. 64వ డివిజన్ కండ్రికలో శనివారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి పాల్గొన్నారు. పింఛన్‌దారులను ఆత్మీయంగా పలకరించి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో 2,27,933 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.98.42 కోట్ల మేర పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ, అధికారులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సుమతీ శతకం అని, ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఆ సినిమా హీరో అమర్‌దీప్ చౌదరి అన్నారు. ఈ నెల 6న విడుదల కానున్న ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యూనిట్ సభ్యులు శనివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్‌దీప్‌చౌదరి మాట్లాడుతూ.. నా కెరీర్ ‘రామ’ అనే పేరుతోనే మొదలైందనీ, ఈ చిత్రంలో కృష్ణ పేరుతో తన క్యారెక్టర్ ఉంటుందన్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని, మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు. అనంతరం హీరోయిన్ శైలి మాట్లాడుతూ.. చిత్రంలో తన క్యారెక్టర్ పూర్తిస్థాయి గ్రామీణ యువతీగా ఉంటుందన్నారు. హాస్య నటుడు టేస్టీ తేజ, దర్శకుడు ఎం.ఎం.నాయుడు, నిర్మాత సాయి పాల్గొన్నారు.
విజయవాడలీగల్: దోపిడీ చేసి గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,500 చొప్పున జరిమానా విధిస్తూ 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ డి.లక్ష్మి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, రావినూతల గ్రామానికి చెందిన పుచ్చకాయల నరేష్(26)కు విజయవాడ చిట్టినగర్ ఏరియాకు చెందిన ఫిర్యాదిదారునికి రెండేళ్ల క్రితం ఫేస్ బుక్‌లో పరిచయమయ్యాడు. 2020 అక్టోబర్ 2వ తేదీన ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి విజయవాడ వస్తున్నాను రమ్మని చెప్పి, పుచ్చకాయల నరేష్, అతని స్నేహితులు షేక్ అహ్మద్ అలియాస్ షబీర్, పర్సగాని వేణు అలియాస్ నానిలు ఫిర్యాదిదారుడు హనుమాన్‌పేటకు రాగానే అతనిని కొట్టి, అతని వద్ద ఉన్న కార్, ఐ ఫోన్‌లను లాక్కొని పారిపోయారు. వెంటనే ఫిర్యాదిదారుడు గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరుఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.జగదీష్, అప్పటి గవర్నర్‌పేట ఇన్‌స్పెక్టర్ ఎస్‌వీఎస్ నాగరాజు, ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ ఎ.మురళీకృష్ణ, సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు పర్యవేక్షణలో 8 మంది సాక్షులను విచారించారు. ముగ్గురు నిందితులపై నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పునిచ్చారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఏడుకొండలరావు
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఏడుకొండలరావు


