సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ | - | Sakshi
Sakshi News home page

సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ

Feb 8 2026 3:52 AM | Updated on Feb 8 2026 3:52 AM

సహకార

సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ

సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను భవిష్యత్‌ తరరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. కళాకారులు సహకార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి కళను మరింత విశ్వవ్యాప్తి చేయాలని కోరారు. కొండపల్లి బొమ్మల కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో హస్త కళాకారుల సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమ య్యారు. శతాబ్దాల చారిత్రక ఔన్నత్యమున్న కొండపల్లి బొమ్మకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు అందరి కృషి అవసరమన్నారు. కొత్త డిజైన్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశ, విదేశా ల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ అభివృద్ధితో పాటు కొండపల్లి ఒక మోడల్‌ గ్రామీణ ఆర్థిక కేంద్రంగా మార్చడానికి చొరవ చూపుతున్నా మని వెల్లడించారు. జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, బొమ్మల కళాకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు):ఎన్టీఆర్‌ జిల్లాను డ్రగ్స్‌, గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్‌శాఖ కఠిన చర్యలతో పాటు, మానవతాదృక్ఫథంతో ముందుకు సాగుతున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులు, తమ పిల్లలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు అనుమానం కలిగినా, నిర్ధారణ అయినా వెంటనే పోలీస్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు. ముందుగానే పోలీసులను సంప్రదిస్తే గంజాయి మానేందుకు అవసరమైన కౌన్సెలింగ్‌ , వైద్య చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన సహాయం, మార్గదర్శనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే గంజాయి, డ్రగ్స్‌ వినియోగం, రవాణా , విక్రయం వంటి నేరాల్లో పోలీసులకు చిక్కితే చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌ రహిత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం అందరూ పోలీస్‌ వారితో సహకరించాలని కోరారు.

సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ 1
1/1

సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement