బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవ దానం | - | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవ దానం

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

బ్రెయ

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవ దానం

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవ దానం పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవదానం చేశాడు. పోరంకి క్యాపిటల్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మన్నే హరీష్‌ ఈ వివరాలను బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. చోరగుడి గ్రామానికి చెందిన కందిమళ్ల విజయ దుర్గగోపాల్‌ (57)ఈ నెల ఒకటో తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అత్యవసర వైద్యం కోసం క్యాపిటల్‌ ఆస్పత్రిలో చేర్చారు. అతని బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వైద్యులు నిర్ధారించారు. విజయదుర్గాగోపాల్‌ అవయవాలను దానం చేయటానికి కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకొచ్చారు. జీవన్‌దాన్‌ సంస్థతో మాట్లాడి అవయవ దానానికి గ్రీన్‌ చానల్‌ సిద్ధం చేశారు. విజయదుర్గగోపాల్‌ లివర్‌ మణిపాల్‌ ఆస్పత్రికి, కళ్లు ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి, కిడ్నీలు క్యాపిటల్‌ ఆస్పత్రిలో రోగులకు దానం చేశారు. జీవన్‌దాన్‌ సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ జి.రఘు నందన్‌, డాక్టర్‌ కె.రాంబాబు పాల్గొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు హత్య కేసులో నిందితుడి అరెస్టు చెరువులో పడి బాలుడు మృతి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం నకిలీ మద్యం కేసులో బెయిల్‌ తీర్పు వాయిదా

లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం మత్తులో వాహనాలు నడిపిన ఆరుగురికి ఆరో అడిషనల్‌ జ్యూడిషల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ లెనిన్‌బాబు బుధవారం జైలు శిక్ష విధిస్తూ తీర్చు చెప్పారు. నగరంలో ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌ బేగం నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. లిటీవల రెండు, ఐదో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుతున్న ఆరుగురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఒకరికి 14 రోజులు, మరొకరికి పది రోజులు, ఇద్దరికి ఎనిమిది రోజులు, మరొకరికి వారం, ఇంకొకరికి నాలుగు రోజుల చొప్పున న్యాయమూర్తి లెనిన్‌బాబు జైలు శిక్ష విధించారు. ఒకరికి రూ.15 వేల జరిమానా విధించారు. నగరంలో నిత్యం ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారని, మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని డీసీపీ షిరీన్‌ బేగం హెచ్చరించారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో సంచలనం రేకెత్తించిన హత్యకేసులో నిందితుడిని జీఆర్‌పీ పోలీసులు అరెస్టు చేశారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ జె.వి.రమణ, ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫతే ఆలీబేగ్‌ బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు.. మంగళవారం ఉదయం రైల్వేస్టేషన్‌లో హత్య జరిగిందని సమాచారం అందటంతో ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెజ్జోని పేటలో నివసించే పలసాని సాయికృష్ణ అలియాస్‌ టాటూసాయి(28)గా గుర్తించారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలంచి హత్యకు పాల్పడింది సరగడ రాముగా గుర్తించారు. కొద్ది గంటల్లోనే నిందితుడిని రైల్వే పార్శిల్‌ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అదేరోజు రాత్రి 7.15 గంటలకు రైల్వేకోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. తాను వన్‌టౌన్‌లోని చర్చి ప్రాంతంలో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న సమయంలో తన బ్యాగును సాయికృష్ణ దొంగి లించాడనే అనుమానంతో అతడిని సరగడ రాము వెంబడించాడు. రైల్వేస్టేషన్‌లోని ఎనిమిదో నంబర్‌ ప్లాట్‌ఫాం సమీపంలో పదునైన ఆయుధంతో దాడి చేసి అక్కడి నుంచి పరాయ్యాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడు, మృతుడు పలు క్రిమినల్‌ కేసుల్లో నిందితులని వెల్లడైంది.

గన్నవరం: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన గన్నవరం మండలంలోని బూతిమిల్లిపాడు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిన్నఆవుటపల్లి గ్రామానికి చెందిన కాండ్రు రాజశేఖర్‌, రత్నకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆహిష్‌(7) ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో బూతిమిల్లిపాడులో బుధవారం జరిగిన పునీత అంతోని పండుగకు రత్నకుమారి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని వెళ్లింది. కుటుంబ సభ్యులు ప్రార్థనలో ఉండగా ఆహిష్‌ మరో బాలుడితో కలిసి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ఆడు కుంటూ ఆహిష్‌ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. బాలుడు మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం): ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన తుమ్మలపాలెం శివారులో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. తుమ్మలపాలెం గ్రామానికి చెందిన దువ్వపు గణపతి నాగరాజు (36) గుంటుపల్లిలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పిల్లలకు బుధవారం మధ్యాహ్నం భోజనం ఇచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. గణపతి నాగరాజు తిరిగి ఇంటికి వస్తుండగా గుంటుపల్లి వైపు నుంచి దూసుకొచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విజయవాడలీగల్‌: నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న జినేష్‌, శిబు తరఫున దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్లపై బుధవారం ఎకై ్సజ్‌ న్యాయస్థానంలో విచారణ పూర్తయింది. తీర్పును ఈ నెల తొమ్మిదో తేదీకి న్యాయమూర్తి లెనిన్‌బాబు వాయిదా వేశారు.

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవ దానం 1
1/1

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవ దానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement