దుర్గమ్మకు పలువురు విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు పలువురు విరాళాలు

Feb 3 2026 8:03 AM | Updated on Feb 3 2026 8:03 AM

దుర్గమ్మకు పలువురు విరాళాలు

దుర్గమ్మకు పలువురు విరాళాలు

దుర్గమ్మకు పలువురు విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్ధంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్‌ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు. విజయవాడ హనుమాన్‌ పేటకు చెందిన ఆలపాటి మారుతీరామ్‌ దంపతులు ఆలపాటి రామారావు, శాంత పద్మకుమారి పేరిట నిత్యాన్నదానానికి రూ.1,10,116 విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్‌ డీవీవీ సత్యనారాయణకు అందజేశారు. హైదరాబాద్‌ దిల్‌షుక్‌నగర్‌కు చెందిన గంజి ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి చెందిన గంజి కొండయ్య యాదవ్‌ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement