బోనాలమ్మా....బోనాలు
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు రెండవ రోజు సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించారు. దీక్ష విరమించిన స్వాములు తెల్లవారు జామునే మునేరులో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. ఆదివారం రాత్రి కల్యాణం అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామంలోని ఆలయాల్లో, ఇసుక తిన్నెల మీద సేద తీరారు. బుర్రకథల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు కూర్చుని విన్నారు. అమ్మవారి కల్యాణ తలంబ్రాలను ఆలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందజేశారు.
–పెనుగంచిప్రోలు


