పోలీస్ గ్రీవెన్స్‌లో 107 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి 107 ఫిర్యాదులు వచ్చాయి. నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. నడవలేని, వృద్ధుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకోవడంతో పాటు, వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ, ఆస్తి వివాదాలకు సంబంధించి 64, కుటుంబ కలహాలపై 6, వివిధ మోసాలపై 8, మహిళా సంబంధిత నేరాలపై 5, దొంగతనాలపై 6, కొట్లాటలపై 2, ఇతర వివిధ సమస్యలపై 16 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన స్థానిక తంబరేణి గార్డెన్స్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్‌పేట క్రాస్‌రోడ్స్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు స్కూటీపై పెనుగంచిప్రోలు నుంచి వెళ్తుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో బాణావతు దేవేంద్రనాయక్(24) ఘటనా స్థలంలో మృతి చెందగా మేడ నరేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్‌ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరువూరు: అందమైన యువతుల ఫొటోలను ఎరగా చూపి ఒక వ్యక్తి నుంచి అక్రమంగా డబ్బులు, బంగారం తస్కరించిన నిందితులను తిరువూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ గిరిబాబు తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు శివారు తంగిళ్ళబీడులో నివసించే రౌడీషీటర్ కనపర్తి రేణుక యువతుల ఫొటోలను వాట్సాప్‌లో పంపుతూ విటులను ఆకర్షించేది. ఇదే తరహాలో గత నెల 31న కె.మాధవరావు అనే వ్యక్తిని తన ఇంటికి పిలిచి తలుపులు వేసి నగలు, నగదు బలవంతంగా లాక్కుని మరో 2 లక్షలు ఇవ్వాలని, లేదంటే తిరువూరు పోలీసుస్టేషన్లో కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రేణుకను, ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని విచారించి వారినుంచి సొత్తు రికవరీ చేశారు. నిందితులను అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు.
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో బెయిల్‌పై ఉన్న వైఎస్సార్ సీపీ పార్లమెంటు ఫ్లోర్‌లీడర్ మిధున్‌రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్నందున రెండు, నాలుగో శనివారాల్లో విచారణాధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన తరఫు హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.
మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటీషన్లు
ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్‌పై ఉన్న గోవిందప్ప బాలాజీ తరఫున న్యాయవాది గోలి నరసింహారావు ఏసీపీ న్యాయస్థానంలో సోమవారం పిటీషన్ దాఖలు చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్‌పై ప్రాసిక్యూషన్‌కు నోటీసులు జారీచేయాలని ఆదేశిస్తూ మంగళవారానికి, ధనుంజయ్‌రెడ్డి తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్‌పై ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేసేందుకు ఈనెల ఆరో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో బెయిల్‌పై ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎకై ్సజ్ పోలీసులు 8వ అదనపు జిల్లా న్యాయసస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతుల ప్రకారం కేసుకు సంబంధించి మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టంగా న్యాయస్థానం ఆదేశించినప్పటికీ అందుకు విరుద్ధంగా జోగి రమేష్ వ్యవహరిస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరగనుంది.
నకిలీ మద్యం కేసులో పీటీ వారెంటుకు అనుమతి
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో మదనపల్లి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఏ–22 నిందితుడు సి.పి.సెంథిల్‌ను పీటీ వారెంటు కోరుతూ విజయవాడ ఎకై ్సజ్ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ను అనుమతిస్తూ ఎకై ్సజ్ న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 12 లోపు న్యాయస్థానంలో హాజరుపరచాలన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో 107 ఫిర్యాదులు
పోలీస్ గ్రీవెన్స్‌లో 107 ఫిర్యాదులు


