టెక్నాలజీపై ప్రతి ఒక్కరూ పట్టు సాధించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విధి నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది టెక్నాలజీని ఉపయోగించేందుకు నైపుణ్యాలు పెంచుకోవాలని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. నగరంలోని ఏఆర్ గ్రౌండ్స్‌లో సోమవారం పోలీసు సిబ్బంది, అధికారులకు వృత్తి నైపుణ్యం మెరుగుపర్చుకునే పక్రియలో భాగంగా యాన్యువల్ మొబిలైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీపీ సరిత మాట్లాడుతూ ప్రస్తుతం నేరాలను ఛేదించేందుకు టెక్నాలజీ ఎంతో కీలకంగా మారినట్లు తెలిపారు. అనంతరం పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. సిటీ ఏఆర్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు శారీరకంగా, మానసికంగా, వృత్తి నైపుణ్యం మెరుగుపరుచుకుని, ఆధునిక కాలానికి అనుగుణంగా సంసిద్ధులయ్యేలా శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ టెక్నాలజీ పరంగా సైబర్ సెక్యూరిటీ, ఈ డిప్లాయ్‌మెంట్, సి.సి.కెమెరాలు, డ్రోన్, అస్త్రం యాప్ మొదలైన వాటిపై శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో హెడ్ క్వార్టర్ ఏడీసీపీ కుంబా కోటేశ్వర రావు, ఏసీపీ ప్రేమ్ కుమార్, సీఎస్‌డబ్ల్యూ ఏసీపీ చిరంజీవి, ఆర్‌ఐలు శ్రీకాంత్ నాయక్, శ్రీనివాస్, రాజేంద్ర, బాలసుబ్రమణ్యం, ఆర్.ఎస్.ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.
యాన్యువల్ మొబిలైజేషన్ సదస్సులో డీసీపీ కేజీవీ సరిత


