ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత | - | Sakshi
Sakshi News home page

ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత

Feb 1 2026 7:26 AM | Updated on Feb 1 2026 7:26 AM

ఏసీటీ

ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత

ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత అవనిగడ్డ: అవనిగడ్డకు చెందిన నరహరశెట్టి భానుప్రకాష్‌ తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌ – 1 సాధించారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో భానుప్రకాష్‌ అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారిగా ఎన్నికయ్యారు. కోడూరు మండలం మాచవరంకు చెందిన సీనియర్‌ న్యాయవాది, మాజీ ఏజీపీ నరహరశెట్టి ఈశ్వరరావు 26 ఏళ్ల క్రితం అవనిగడ్డ వచ్చి ఇక్కడే స్ధిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈయన కుమారుడైన భానుప్రకాష్‌ ఐదో తరగతి వరకూ అవనిగడ్డ ఎన్‌ఆర్‌ఐ వికాస్‌ స్కూల్‌లో చదివారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ వేలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో, ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో, బీటెక్‌ చైన్నెలోని విట్‌లో పూర్తి చేశారు. బీటెక్‌ అనంతరం సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో 2022లో ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. అనంతరం రెండేళ్లు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్‌ అయ్యారు. 2023 డిసెంబర్‌లో గ్రూప్‌ 1 ఇచ్చిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న భానుప్రకాష్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 2024 మార్చిలో నిర్వహించిన ప్రిలిమ్స్‌లో క్యాలిఫై కాగా, 2025 మేలో జరిగిన మెయిన్స్‌లో విజయం సాధించారు. 1:2 పద్ధతిన ఇంటర్వ్యూలు నిర్వహించగా శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఏపీ కమర్షియల్‌ టాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. తండ్రి ఈశ్వరరావు సీనియర్‌ న్యాయవాది కాగా, గతంలో ఏజీపీగా పనిచేశారు. తల్లి చందు నాగరాజకుమారి కోడూరు జెడ్పీ హైస్కూల్‌లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. భానుప్రకాష్‌ చెల్లెలు శ్రీసుప్రియ ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరు ఇన్ఫోసిస్‌లో జాబ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు భానుప్రకాష్‌కు స్వీట్లు తినిపించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. వైఎస్సార్‌ సీపీ నేతలు నలుకుర్తి రమేష్‌, గాజుల జయగోపాల్‌, గుంటూరు సురేష్‌ తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. గ్రూప్‌ – 1లో విజయం సాఽధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రాథమిక స్ధాయిలో నాకు నేర్పిన క్రమశిక్షణ నా విజయానికి కారణం. సివిల్స్‌ సాధించాలని చిన్నవయస్సులోనే అనుకున్నాను. అందుకు నా తల్లిదండ్రుల ఎంతగానో ప్రోత్సహించారు. సివిల్స్‌లో విజయం సాధించి ఐపీఎస్‌ కావాలన్నదే లక్ష్యం.

ఎంపికైన అభ్యర్థులకు అభినందనల వెల్లువ

ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌..

ఐపీఎస్‌ కావాలన్నదే లక్ష్యం :

ఎన్‌.భానుప్రకాష్‌

వైష్ణవి విజయం పరంపర..

దేవదాయశాఖ ఈఓగా విధులు

నిర్వహిస్తూనే గ్రూప్‌–1 కు ఎంపిక

జగ్గయ్యపేట: కలలు కనటమే కాదు. వాటిని సహకారం చేసుకునే సత్తా ఉండాలి. ఆశల పల్లకీలో ఊరేగడమే కాదు.. ఆశయాలు సాధించే దిశగా సాధన చేయాలి. లక్ష్యం ఏంతదూరమైన గమ్యం సుదూరమైన అలుపెరగక పరుగు పెడితేనే అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు చేరతారు. వారే విశ్వ విజేతలు అవుతారు. ఆమె జగ్గయ్యపేట పట్టణానికి చెందిన అంగడాల వైష్ణవి దేవదాయశాఖలో జగ్గయ్యపేట మండలంలో గ్రూప్‌ టెంపుల్స్‌ ఈఓగా పని చేస్తూనే గ్రూప్‌–1లో ఏసీటీఓగా ఉద్యోగం సాధించారు.

వ్యక్తిగత శ్రద్ధే విజయానికి సోపానం..

వైష్ణవి చిన్నతనం నుంచే విద్యపై పట్టు సాధించేది. 1 నుంచి 7వ తరగతి వరకు పట్టణంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదివి 8 నుంచి ఇంటర్‌ వరకు విజయవాడలో విద్యను అభ్యసించింది. తిరుపతిలో ఎస్వీ యూనివర్సీటీలో బీటెక్‌ డెయిరీ టెక్నాలజీలో మంచి ప్రతిభ కనభరిచి మూడు గోల్డ్‌ మెడల్స్‌ సాధించింది. 2019లో యూపీఎస్‌సీలో ప్రిపరెన్స్‌ ప్రారంభించి, 2023లో గ్రూప్‌–3లో దేవదాయశాఖలో ఈఓగా ఎంపికై ంది. అంతేకాకుండా గ్రూప్‌–2, 4లో కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు వచ్చినప్పటికీ గ్రూప్‌–1 పైన దృష్టి సారించి 2026 ఫలితాల్లో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఎంపికై ంది.

తండ్రి ప్రోత్సాహమే..

తండ్రి రవీంద్రబాబు వత్సవాయి మండలం దేచుపాలెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి శివకుమారి గృహిణి, సోదరి భార్గవి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అయితే తండ్రి ప్రోత్సాహంతోనే ఒక పక్క తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే గ్రూప్‌–1 పరీక్షకు సిద్ధమైంది. పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇస్తుంటే సాధించలేనిది ఏది లేదని.. ఫెయిలైనా అధైర్య పడకూడదంటూ నమ్మకం కలిగిస్తే సక్సెస్‌ అవుతారని వైష్ణవి తల్లిదండ్రులు అంటున్నారు.

ఐఏఎస్‌ కావడమే నా కల : వైష్ణవి

గ్రూప్‌–1 సాధించాలంటే ఓపిక చాలా ముఖ్యం. చాలా కాలం ప్రణాళికబద్దంగా కష్టపడి చదవాలి. లక్ష్యం చేరుకోవాలంటే అన్ని బాంధవ్యాలను తాత్కాలికంగా మర్చిపోవాల్సిందే. పిల్లలకు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో రాణించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం. ఐఏఎస్‌ కావడమే నా కల.

ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత1
1/1

ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement