వృద్ధుల ఆవేధన | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల ఆవేధన

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

వృద్ధ

వృద్ధుల ఆవేధన

బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 వృద్ధుల ఆవేధన పులిచింతల ప్రాజెక్టు సమాచారం నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం –8లోu వైద్య విద్యలో ఏఐతో నూతన ఒరవడి ఆస్తులే శాపం.. బిడ్డలకు భారం చట్టం ఓ కంట కనిపెడుతోంది పట్టించుకోని కొడుకు

న్యూస్‌రీల్‌

వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని సంతానం మందులకూ డబ్బులు లేక పండుటాకుల అవస్థలు ఆసరా కోసం అధికారులను ఆశ్రయిస్తున్న వైనం ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 454 ఫిర్యాదులు

తోబుట్టువుల మోసం

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36.4577 టీఎంసీలు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన చల్లా చంద్రమౌళి, సరోజిని దంపతులు మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యలో ఏఐ ఆధారిత కాంపిటెన్సీ బెస్ట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌కు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ తెలిపారు. రాష్ట్రంలోని 38 మెడికల్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, వైఎస్‌ ప్రిన్సిపాల్స్‌, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులకు మంగళవారం వెబ్‌ఎక్స్‌ నిర్వహించారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలో వైద్య ఆరోగ్య రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల డాక్టర్‌ చంద్రశేఖర్‌ బందుగల ఎడ్మెడ్‌ ఏఐ సహకారంతో రూపొందించిన ఏఐ ఆధారిత అభ్యాస మౌళిక సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. డాక్టర్‌చంద్ర శేఖర్‌ బొందుగుల మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడినప్పుటికీ మన దేశంలోని వైద్య విద్యార్థుల కోసం ఏదైనా చేయాలని అత్యుత్తమ నాణ్యత కలిగిన ఏఐ ఆధారిత వైద్య విద్య పక్రియలను అందించేందుకు యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రతిభావంతులైన వైద్యులను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌, రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధ తదితరులు పాల్గొన్నారు.

ఈ వృద్ధుడి పేరు షేక్‌ ఆలీ సాహెబ్‌. వయసు 80 ఏళ్లు. స్వగ్రామం జి.కొండూరు మండలం కవులూరు. సంతానం లేరు. గ్రామంలో 75 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. వృద్ధాప్యపు సమస్యలతో బాధపడుతూ తనకున్న భూమిని నలుగురు చెల్లెళ్ల పేరుతో రిజిస్టర్‌ చేశారు. అంతే ఆ తర్వాత అతని గురించి చెల్లెళ్లు పట్టించుకోలేదు. ఆలీ సాహెబ్‌ కంటి చూపు పూర్తిగా దెబ్బతింది. అక్కడా ఇక్కడా తిరుగుతూ ఇబ్బందులు పడుతూ దూరపు బంధువుల ఇంటికి చేరాడు. తన భూమి తనకు ఇప్పించాలంటూ వృద్ధుల సంరక్షణ చట్టం కింద కలెక్టర్‌ కార్యాలయంలో మూడేళ్ల కిందట ఫిర్యాదు చేశాడు. నందిగామ ఆర్డీఓ కార్యాలయం అతనికి మెయింటినెన్స్‌ ఇవ్వాలని ఆర్డర్‌ జారీ చేసింది. అది కూడా ఆ నలుగురు చెల్లెళ్లు సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో వృద్ధుడు ఆప్పీల్‌ చేసుకున్నాడు. తనకు ఆిస్తి ఉండీ ఈ దుస్థితి ఏమిటని? రోదిస్తున్నాడు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జీవితంలో చివరి మజిలీకి చేరిన పండుటాకులు వారు. మనవళ్లు, మనవరాళ్ల ముద్దూ ముచ్చట్లతో హాయిగా జీవితం గడపాల్సిన వయసు. వారు కష్టపడి సంపాదించిన, పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులను తమ పేరున రాయించుకున్న అనంతరం బిడ్డలు పట్టించుకోకపోవడంతో ఇక తమకు దిక్కెవరని రోదిస్తున్నారు. వయోభారం తెచ్చిన రోగాల నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నారు. బిడ్డలపై కొండంత ప్రేమ ఉన్నా మనసు చంపుకొని.. గుప్పెడు మెతుకులకు, మందు బిళ్లలకు అవసరమైన డబ్బులన్నా ఇప్పించండయ్యా అంటూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో బిడ్డలపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. రెండేళ్లలో ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 454 ఫిర్యా దులు అందాయి. వాటిలో 392 ఫిర్యాదులను పరిష్కరించగా, మరో 62 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. బిడ్డలను పిలిచి తల్లిదండ్రుల బాధ్యతలు చూసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అనంతరం తమ ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో అన్న విషయాన్ని పట్టించుకోవడంలేదు. అధికారులు పరిష్కరించామని చెబుతున్న కేసుల్లో వృద్ధులు ఎప్పటిలానే ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నారు.

కన్నబిడ్డలకు, తోడబుట్టిన వారికి ఉన్న ఆస్తులు రాసిచ్చి.. ఆ తరువాత ఆలనా పాలనా లేక అల్లాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగు తోంది. అవగాహన లేని కొందరు వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆసరా పొందలేకపోతున్నారు. మరి కొందరు ఎవరో ఒకరి ద్వారా ఈ చట్టాన్ని ఆశ్రయించినా జాప్యం కారణంగా తీవ్రమైన ఆవస్థలు పడుతు న్నారు. నా అన్నవారు లేక, ఆత్మీయ పలుకరింపులకు నోచుకోక, ఉన్న ఆస్తులు పరులపాలై అలో లక్ష్మణా అంటూ విలపిస్తున్నారు. కొందరు బిడ్డలు ఉద్దేశ పూర్వకంగానే తల్లిదండ్రులను వేధిస్తున్నారు. వారు చట్టాన్ని ఆశ్రయిస్తే నెల నెలా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వదిలించుకోవచ్చు అనే భావన బిడ్డల్లో పెరిగిపో యింది. ఇలాంటి కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు సంబంధిత అధికారులను వేడుకుంటున్నాయి. ఆవసాన దశలో ఉన్న వారికి డబ్బులు ఇస్తే సరిపోదని, వారి బాగోగుల మాటేమిటని ప్రశ్నిస్తున్నాయి. వయో భారం, ఒంటరి జీవితాలు గడుపుతున్న వారికి ఆదరణ కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

డాక్టర్‌ బొందగల చంద్రశేఖర్‌ను సన్మానిస్తున్న వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌

ప్రతి ఒక్కరూ ఏదో రోజు వృద్ధాప్యానికి చేరువ కావాల్సిందే. మనం తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు అందిస్తున్నామో భవిష్యత్‌లో మనకు అవే లభించే పరిస్థి తులు వస్తాయి. ప్రేమ, అప్యాయతల మధ్య వృద్ధుల జీవితం సాగాలి. వృద్ధాప్యంలో ఇబ్బందులు పడే వారి సంక్షేమానికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం ఉంది. ఈ చట్టంపై అవగాహన పెంచాలి. ఈ చట్టం కింద వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి. వృద్ధులను ఇబ్బంది పెట్టే వారిని చట్టం ఓ కంట కనిపెడుతుంది. కచ్చితంగా బాధితులకు రక్షణ కల్పిస్తుంది.

– డాక్టర్‌ జి.లక్ష్మీశ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌

ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధులు మేక సూర్యనాయణ, విజయలక్ష్మి దంప తులు. వీరిది విస్సన్నపేట మండలం నరసాపురం. వారికి ఒక్కగానొక్క కొడుకు సంతానం. తండ్రికి వంశపారంపర్యంగా వచ్చిన రెండు ఎకరాలు, తల్లికి పుట్టింటి నుంచి వచ్చిన 10 ఎకరాలు కలిపి 12 ఎకరాల భూమిని ఆ కొడుకు తన పేర రాయించుకున్నాడు. ఆ తర్వాత తల్లి దండ్రుల ఆలనాపాలన పట్టించుకోవడం లేదు. సూర్య నారాయణ రెండు మోకాళ్లు దెబ్బతిన్నాయి. మోకాళ్ల ఆపరేషన్‌కు డబ్బులు లేవు. విజయలక్ష్మి మధుమేహం వ్యాధితో బాధపడుతోంది. వృద్ధులు ఇద్దరి మందులకే నెలనెలా వేల రూపాయల ఖర్చవుతోంది. ఆస్తులు ఎలాగూ రాయించుకు న్నారు. కనీసం మందులకై నా డబ్బులు ఇప్పించండంటూ కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నారు. అంతకు ముందు తిరువూరు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు. కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు.

7

వృద్ధుల ఆవేధన1
1/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన2
2/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన3
3/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన4
4/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన5
5/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన6
6/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన7
7/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన8
8/9

వృద్ధుల ఆవేధన

వృద్ధుల ఆవేధన9
9/9

వృద్ధుల ఆవేధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement