11 నెలల్లో నిందితుడికి జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

11 నెలల్లో నిందితుడికి జైలు శిక్ష

Feb 11 2026 8:53 AM | Updated on Feb 11 2026 8:53 AM

11 నెలల్లో నిందితుడికి జైలు శిక్ష

11 నెలల్లో నిందితుడికి జైలు శిక్ష

11 నెలల్లో నిందితుడికి జైలు శిక్ష

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): నేరం జరిగిన 11 నెలల్లోనే నిందితుడికి కోర్టు జీవితకాలపు శిక్ష విధించేలా దర్యాప్తు చేసిన పోలీసులను కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అభినందించారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వేర్వేరుగా జీవిస్తున్నారు. భార్య తన ఇద్దరు కుమార్తెలతో మంటాడలో, భర్త తన కుమారుడు కొమ్ము సౌల్‌తో కలిసి ప్రకాశం జిల్లా కొండెంపి మండలం పెట్లూరు గ్రామంలో నివసిస్తున్నారు. 2023లో కొమ్ము సౌల్‌ మంటాడలోని తల్లి వద్దకు వచ్చాడు. సౌల్‌ తన మైనర్‌ చెల్లెలికి మాయమాటలు చెప్పి 2024 డిసెంబర్‌ 19వ తేదీన గుణదల తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమైపె తరచూ లైంగికదాడి చేశాడు. కొంత కాలానికి బాలిక గర్భం ధరించడంతో విషయం బయటికి పొక్కింది. తల్లి నిలదీయగా అన్న సౌల్‌ విషయం చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పమిడిముక్కల పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్‌వినీల్‌ కేసు దర్యాప్తు చేపట్టి సౌల్‌ను అరెస్టు చేసి, పూర్తి ఆధారాలతో విజయవాడ పోక్సో కోర్టులో హాజరుపరిచారు. నింది తుడిపై నేరం నిరూపణ కావడంతో సౌల్‌కు జీవితకాలపు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఈ నెల తొమ్మిదో తేదీన తీర్పు చెప్పింది. బాలికకు రూ.30 వేలతో పాటు రూ.5 లక్షలను పరిహారంగా ఇవ్వాలని జిల్లా లీగల్‌సెల్‌ సర్వీసెస్‌ అథారిటీని కోర్టు ఆదేశించిందని ఎస్పీ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసు దర్యాప్తు చేసిన డీఎస్పీ ధీరజ్‌వినీల్‌తో పాటు పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్‌.రాజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement