22, 23 తేదీల్లో పీడీఎస్‌యూ మహాసభలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జాతీయ ప్రథమ మహాసభలను ఈనెల 22, 23 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జాతీయ మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, మేధావులు కార్మికులు, కర్షకులు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో విద్యారంగ సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. నూతన జాతీయ విద్యా విధానం–2020, విద్య వ్యాపారీకరణ, ప్రభుత్వ యూనివర్సిటీల్లో కుల, మత ప్రాతిపదికన వివక్ష, యూజీసీ నిర్వీర్యం వంటివి జరుగుతున్నాయన్నారు. లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ, ఉపాఽధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు యు.గనిరాజు, ఇడంపాక విజయ్‌కన్నా, తెలంగాణ, ఏపీ అధ్యక్షులు మొగిలి వెంకటరెడ్డి, ఎస్. కిరణ్‌కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
సంఘ జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ


