దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.91కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.91కోట్లు

Feb 5 2026 7:14 AM | Updated on Feb 5 2026 7:14 AM

దుర్గ

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.91కోట్లు

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.91కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు గాను ఆలయ ప్రాంగణంలోని హుండీల ద్వారా రూ. 2,91,82,998 మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. నగదుతో పాటు 251 గ్రాముల బంగారంతో పాటు 3.255 కిలోల వెండి లభించాయన్నారు. ఇక విదేశీ భక్తులు తమ దేశానికి చెందిన డాలర్లను భారీగానే అమ్మవారికి సమర్పించారు. అమెరికా డాలర్లు 785, ఇంగ్లాండ్‌ పౌండ్లు 25, కువైట్‌ దినార్లు 10, ఆస్ట్రేలియా డాలర్లు 365, సింగ పూర్‌ డాలర్లు 12, కెనడా డాలర్లు 300, ఒయన్‌ రియాల్స్‌ 200, యూఏఈ దిర్హమ్స్‌ 80, పోలాండ్‌ జెలోటీలు 110 లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. లెక్కింపును ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. బందరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా టీటీకే రెడ్డి 12 నుంచి తెలుగు భాషా సంగీత మహాసభలు రైతులే స్వయంగా పంట నమోదు చేసుకోవచ్చు

మచిలీపట్నంఅర్బన్‌: మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ అదనపు వైద్య విద్యా డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ టీటీకే రెడ్డిని, మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌గా ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఇన్‌చార్జ్‌)గా నియమించినట్లు బుధవారం వైద్య విద్యా డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటులో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డాక్టర్‌ టి.టి.కె. రెడ్డి తక్షణమే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పదవికి సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరించి, నివేదికను డీఎంఈ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

విజయవాడ కల్చరల్‌: విజయవాడలో తొలిసారిగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి మూడు రోజులపాటు తెలుగు భాషా సంగీత మహాసభలను నిర్వహిస్తున్నట్లు స్వరఝరి సంగీత సేవా సంస్థ కార్యదర్శి మోదుమూడి సుధాకర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే సంగీత ప్రదర్శనలు వాగ్గేయకారుల సంగీత సాహిత్యసేవ అంశంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అన్నవరపు రామస్వామి ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు కార్యక్రమంలో గండూరి శ్రీనివాస మూర్తి శిష్యులచే బృందగానం, అన్నమయ్య తెలుగు భాషా వరివస్య, సినీ సంగీతంలో విరబూసిన తెలుగుభాష, అన్నమాచార్యుల సంకీర్తన గానం, ఆంధ్ర వాగ్గేయకారుల తెలుగు సంగీత రచనలు తదితరాలుంటాయన్నారు. 13వ తేదీన త్యాగయ్య పంచరత్న కీర్తనల విశిష్టత, లలిత సంగీంలో సంగీత సాహిత్య విలువలు, జానపద సంగీతంలో తెలుగుభాష, క్షేత్రయ్య పదాలు, శ్యామశాస్త్రి రచనలు.. 14న శనివారం తెలుగు సంగీత సంకీర్తనలు, తెలుగుభాషకు వాగ్గేయకారుల సేవ, సంగీత మూర్తి త్రయం తెలుగుభాషా శైలి అంశాలపై ప్రసంగాలుంటాయని తెలిపారు.

కంకిపాడు: రబీ సాగులో రైతులు స్వయంగా పంట నమోదు చేసుకోవచ్చని, ఈ–పంట యాప్‌ ద్వారా నమోదు చేసుకోవటం తప్పనిసరి అని కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.పద్మావతి అన్నారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏపీఏఐఎంఎస్‌ 2.0 యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి రైతులు స్వయంగా డౌన్లోడ్‌ చేసుకుని ఆధార్‌ వివరాలను నమోదు చేసుకుని, ఎం.పిన్‌ ద్వారా లాగిన్‌ అయ్యి.. ‘నా పొలాలు’ విభాగంలో సాగు వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. రైతు సేవ కేంద్రం సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరణ చేస్తారన్నారు. ఇప్పటి వరకూ ఈ–యాప్‌ ద్వారా 19 మంది రైతులు 43 సర్వే నంబర్లకు ఈ–పంట నమోదు చేసుకున్నారన్నారు. పంట నమోదు సమయంలో రైతు ఒకవేళ పొలంలో ఉంటే వివరాలను అప్లోడ్‌ చేసిన వెంటనే అక్కడికక్కడే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు.

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.91కోట్లు 1
1/1

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.91కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement