క్వారీ లీజుల దరఖాస్తులపై దృష్టిపెట్టాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమరావతిలో మౌలిక వసతులకు సంబంధించిన పనుల వేగవంతానికి మైన్స్ శాఖతో పాటు రెవెన్యూ, అటవీ, పర్యావరణం వంటి సమన్వయ శాఖల కృషి కూడా కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ సమావేశం బుధవారం జరిగింది. మైన్స్‌తో పాటు రెవెన్యూ, అటవీ, సీఆర్‌డీఏ, పర్యావరణం తదితర విభాగాల అధికారులు హాజరైన ఈ సమావేశంలో రాజధాని పనులు – జిల్లా సమన్వయ శాఖల భాగస్వామ్యం, ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం క్వారీలకు ఉన్న లీజులను సమీక్షించుకుంటూ కొత్త క్వారీ లీజుల దరఖాస్తులను వీలై నంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. గనులు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో కూడిన బృందాలు జాయింట్ ఇన్‌స్పెక్షన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కీలకమైన నిరభ్యంతర పత్రాల (ఎన్‌ఓసీ) జారీకి రెవెన్యూ, అటవీ, పీసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్ కుమార్, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, సీఆర్‌డీఏ ఇంజనీరింగ్ అధికారి బి.శ్రీనివాసరావు, పీసీబీ ఈఈ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
రూ.9.13 లక్షల బ్యాటరీ వాహనం అందజేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పీహెచ్‌డీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ కొత్త గైడ్‌ల పునరుద్ధరణ, మార్గదర్శకులు, కేంద్రాల గుర్తింపు, ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్స్ దరఖాస్తులు 2025, ఫాకల్టీ రీసెర్చ్ రిపోర్టు ధరఖాస్తులు వంటి వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పీహెచ్‌డీ కొత్త గైడ్‌ల కోసం తొమ్మిది దరఖాస్తులు ఐదింటిని ఆమోదించారు. పీహెచ్‌డీ గైడ్‌ల పునరుద్ధరణ కోసం ఆరు దరఖాస్తులు రాగా ఐదింటిని ఆమోదించారు. ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్ 2025, మొత్తం 147 అప్లికేషన్‌లను సమీక్షించారు. ఫ్యాకల్టీ గ్రాంట్ 2022, 2023, 2024 తుది నివేదికలు అన్నింటినీ ఆమోదించారు. పీహెచ్‌డీ ఆరు నెలల నివేదికలు ధ్రువీకరించిన 22లో 17 ఆమోదించారు. ఈ సందర్భంగా యూఎన్ అజెండా ఫ్రేమ్‌వర్క్, యూఎన్ విజన్ స్టేట్ స్మాస్‌షిప్ అప్రోచ్ ఇతర అంశాలపై ఎక్స్‌పర్ట్ జయరాములు లింగుట్ల విశ్లేషణ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ పాల్గొన్నారు.
క్వారీ లీజుల దరఖాస్తులపై దృష్టిపెట్టాలి
క్వారీ లీజుల దరఖాస్తులపై దృష్టిపెట్టాలి


