8న ఏపీ ఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఈనెల 8న జరగనున్నాయని జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ఎన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ ప్యానల్ పోటీ చేస్తోందన్నారు. ఈ నెల 8న నామినేషన్ల దాఖలు చేస్తారని, ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యా య, కార్మిక, పెన్షనర్లు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో జిల్లా కార్యవర్గం అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. నగర అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


