ఉత్సవాల్లో పిల్లలకు చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్‌లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మేరీమాత ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పిల్లలు తప్పిపోకుండా వారి చేతికి చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్‌లు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ నేతృతంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సీ్త్ర శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ, ఫోరమ్ ఫర్ చైల్డ్ వారు బృందాలుగా ఏర్పడి చిన్న పిల్లలకు ట్రాకింగ్ ట్యాగ్‌లు వేస్తున్నారు. కార్యక్రమంలో మాచవరం సీఐ డీవీ రమణ, ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


