బలహీన వర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

బలహీన వర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు

Feb 5 2026 7:14 AM | Updated on Feb 5 2026 7:14 AM

బలహీన వర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు

బలహీన వర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు

ఇబ్రహీంపట్నం: రెడ్‌ బుక్‌ రాజ్యాంగతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ బలహీన వర్గాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కై లే అనిల్‌కుమార్‌ ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం ఇబ్రహీంపట్నంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకుల రాక్షసత్వానికి బలహీన వర్గాలకు రోజు గడిచే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. జోగి రమేష్‌ ఇంటిపై దాడి బలహీన వర్గాలపై దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇదే విధమైన పాలన కొనసాగితే సామాన్యులు సైతం తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు పవన్‌కల్యాణ్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వారికి వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ఆయన వెంట తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యుడు మోహన్‌రెడ్డి, పామర్రు ఎంపీపీ అశోక్‌, పెదకూరపాడు ఎంపీపీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement