1న జెన్‌ ఏఐ, చాట్‌బాట్‌ క్రియేషన్‌పై వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

1న జెన్‌ ఏఐ, చాట్‌బాట్‌ క్రియేషన్‌పై వర్క్‌షాప్‌

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

1న జెన్‌ ఏఐ, చాట్‌బాట్‌ క్రియేషన్‌పై వర్క్‌షాప్‌

1న జెన్‌ ఏఐ, చాట్‌బాట్‌ క్రియేషన్‌పై వర్క్‌షాప్‌

కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు జెన్‌ ఏఐ(జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌), చాట్‌బాట్‌ క్రియేషన్‌ అంశాలపై ఒక రోజు వర్క్‌ షాపును మార్చి 1వ తేదీన గుంటూరులో చలపతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహిస్తున్నామని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. ఈ వర్క్‌షాపును జేవీవీ, సన్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌, స్వేచ్ఛా ఫ్రీ సాప్ట్‌వేర్‌ మూవ్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం వర్క్‌ షాపుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ మార్పులను అర్థం చేసుకుని వాటిని సృజనాత్మకంగా వినియోగించాలన్నారు.

నూతన సాంకేతిక పరిజ్ఞానం

తెలుసుకునే అవకాశం

వర్క్‌షాప్‌లో వాల్‌మార్ట్‌ ఇండియాలో సీనియర్‌ టెక్నాలజీ నిపుణుడిగా పనిచేస్తున్న దిలీప్‌కుమార్‌ ముఖ్య రిసోర్స్‌ పర్సన్‌గా పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. అలాగే వరంగల్‌ ఎన్‌ఐటీకు చెందిన ప్రొఫెసర్‌ ఎ.రామచంద్రయ్య పాల్గొని సాంకేతికత, శాసీ్త్రయ దృక్పథం వంటి పలు విషయాలపై ప్రసంగిస్తారన్నారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వర్క్‌షాప్‌ ద్వారా విద్యార్థులు థియరీతో పాటు ప్రాక్టికల్స్‌తో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జేవీవీ ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్‌, రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్‌, కె.త్రిమూర్తులు, లెనిన్‌ బాబు, రత్నకమల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement