రీ సర్వే పనులు సమయానికి పూర్తి చేయాలి
రామవరప్పాడు: గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే ప్రాజెక్టు పనులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సర్వే, సెటిల్‌మెంట్ అండ్ భూరికార్డుల డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు సచివాలయంలో గురువారం రీ సర్వేకు సంబంధించిన పనులు, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూర్మనాథ్ ఎల్‌పీఎం వెక్టరైజేషన్, లాగిన్ డేటా పనులను పరిశీలించారు. జీటీ అయిన వెంటనే సమాంతరంగా వెక్టరైజేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. జీటీ సమయంలో ప్రతి రైతుకు ముందుగానే తెలియపరిచి ఈకేవైసీ యాప్ ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్, సర్వే ఏడీ మోహనరావు, విజయవాడ తహసీల్దార్ సుగుణ, డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారావు, హుమయూన్ బేగ్, సర్వేయర్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.


