విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Feb 7 2026 3:08 PM | Updated on Feb 7 2026 3:08 PM

విజయవ

విజయవాడ సిటీ

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 u8లో న్యాయవాదులకు అన్నింటిపై అవగాహన అవసరం పెనమలూరు: న్యాయవాద వృత్తిలో ఉన్న వారు అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని జిల్లా కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జీవీ కృష్ణయ్య అన్నారు. కానూరు సిద్ధార్థ లా కాలేజీలో శుక్రవారం ‘నిజ జీవిత పరిస్థితుల్లో చట్టం అనే వర్తనం’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. న్యాయ కళాశాలలో విద్యార్థులు చదువుకునే సమయంలో నేర్చుకునే చట్టాలతో పాటు న్యాయవృత్తిలో అడుగు పెట్టిన సమయంలో న్యాయవాదులుగా మరిన్ని చట్టాలు తెలుసుకోవాలన్నారు. దీని వల్ల క్లయింట్లకు న్యాయం జరిగే విధంగా న్యాయవాదులు వాదించగలుగుతారని తెలిపారు. న్యాయవాదులు ఒక కేసులో వాదించే సమయంలో చట్టాల్లో వచ్చిన మార్పులు, కోర్టు తీర్పులు, ఆర్టికల్స్‌ సమీకరించి వాదించాలని సూచించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చెన్నుపాటి దివాకర్‌బాబు మాట్లాడుతూ ప్రతి చట్టం మరో చట్టంతో ముడిపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. వైద్య విద్యార్థుల కొవ్వొత్తుల ప్రదర్శన స్వర్ణాంధ్రకు అక్షరాంధ్ర సౌరభాలు సోలార్‌ రూఫ్‌ టాప్స్‌ ఏర్పాటుపై సమీక్ష

న్యూస్‌రీల్‌

చంద్రబాబుకు బీసీలంటే చులకన..

మహిళా నాయకుల ఆత్మీయ స్వాగతం..

ఆంక్షల చట్రాన్ని ఛేదిస్తూ..

పులిచింతల సమాచారం

అన్నదానానికి విరాళాలు

కళాత్మకమైన కలంకారి

ఇదే మొదటిసారి కాదు..

ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
u8లో

జన కెరటం.. ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన అశేష జనవాహినిలో ఓ భాగం, (ఇన్‌సెట్‌లో)అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థిని డాక్టర్‌ బత్తుల దీపిక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైద్య విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొ త్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సిద్ధా ర్థ వైద్య కళాశాల నుంచి జీజీహెచ్‌ వరకూ నిర్వహించిన ర్యాలీలో వైద్య విద్యార్థులు, టీ చింగ్‌ వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్‌ దీపికకు ఘన నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏడుకొండలరావు మాట్లాడుతూ దీపిక పీజీ విద్యార్థినిగా వైద్య రంగానికి అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిరక్ష్యరాస్యులు అక్షరాస్యులుగా మారి.. బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్‌ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యసన సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో ముచ్చటించి, బోధనా పద్ధతులను పరిశీలించారు. వలంటీర్లు అందిస్తున్న శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోజనులైన దాదాపు 96 వేల మంది నిరక్షరాస్యులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించామని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): అన్ని జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్‌ రూఫ్‌ టాప్స్‌ ఏర్పాటు, పీఎం సూర్యఘర్‌పై ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యారావుపేటలోని ఆ సంస్థ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొని, ఫీడర్‌ లెవల్‌ సోలరైజేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు త్వరితగతిన సర్వీసు ఇవ్వాలని, రెవెన్యూ కలెక్షన్స్‌ నూరు శాతం సాధించాలని సూచించారు. లో ఓల్టేజ్‌ సమస్య పరిష్కరించాలని, ఫీడర్స్‌ అన్నీ బ్రేక్‌డౌన్‌ కాకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో టెక్నికల్‌ డైరెక్టర్‌ మురళీ కృష్ణ యాదవ్‌, ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ టీవిఎస్‌ఎన్‌ మూర్తి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.

జి.కొండూరు: సర్కారు ఆంక్షలు.. అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు వచ్చిన వేలాది మంది జనంతో విజయవాడ వెస్ట్‌ బైపాస్‌, నల్లకుంట జంక్షన్‌ కిక్కిరిసిపోయింది. ఇటీవల టీడీపీ గూండాలు పెట్రోలు బాంబులు, యాసిడ్‌ బాటిళ్లతో దాడి చేసి తగలబెట్టిన జోగి రమేష్‌ నివాసాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించి, కుటుంబాన్ని పరామర్శించారు. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ నల్ల కుంట జంక్షన్‌కు మధ్యాహ్నం 1.40గంటలకు చేరిన వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్‌ నివాసానికి చేరుకోవడానికి 3.25 గంటలు సమయం పట్టిందంటే అభిమానులు ఆయనకు ఏ విధంగా స్వాగతం పలికారో అర్థమవుతుంది.

గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ నల్లకుంట జంక్షన్‌ వద్దకు మధ్యాహ్నం 1.40కి చేరుకున్నారు. అక్కడికి ఉదయం 9గంటలకే వేలాదిగా చేరుకున్న అభిమానులు పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో మహిళా నాయకులు వైఎస్‌ జగన్‌కు గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. వెస్ట్‌ బైపాస్‌ ఫ్లై ఓవర్‌పై నుంచి ఆయనపై పూల వర్షం కురిపించారు.

వైఎస్‌ జగన్‌ ఇబ్రహీంపట్నం పర్యటనకు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి కృష్ణానది వారధి మీదుగా విజయవాడ చేరుకొని కనకదుర్గ ఫ్లై ఓవర్‌ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారని ముందుగానే తెలియజేసినా పోలీసులు అనుమతించలేదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను సాకుగా చూపుతూ రూట్‌ మ్యాప్‌ మార్చుకోవాలని నోటీసు ఇచ్చారు. దీనితో గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ మంగళగిరి బైపాస్‌, కాజా నుంచి వెస్ట్‌ బైపాస్‌ మీదుగా నల్లకుంట చేరి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అదేవిధంగా ర్యాలీగా వెళ్లొద్దంటూ నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలకు గురువారం రాత్రే నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ నియోజకవర్గాల వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జులు నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్‌మోహన్‌రావు, దేవినేని అవినాష్‌, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకు పోలీసులు నోటీసులు అందించారు. నల్లగట్ల స్వామిదాసును తిరువూరులోని ఆయన నివాసంలో అడ్డుకోవడంతో పాటు మైలవరం మండలంలోని బాడవ టోల్‌ప్లాజా, మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల వద్ద అడ్డుకున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా, బాడవ టోల్‌ ప్లాజా, రెడ్డిగూడెం మండలం నాగులూరు, జి.కొండూరు వై జంక్షన్‌, కట్టుబడిపాలెం జంక్షన్‌ల వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. అయినప్పటికీ భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, వైఎస్‌ జగన్‌ అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

జోగి రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బీసీలంటే చులకన కాబట్టే బీసీ నాయకుడిగా ఎదుగుతున్న జోగి రమేష్‌ను అణగదొక్కేందుకు చంద్రబాబు అనేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తంబళ్లపల్లిలో నకిలీ లిక్కర్‌ కంపెనీని స్థాపించిన జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోకుండా జోగి రమేష్‌పై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు దారుణ పాలనలో జోగి రమేష్‌ నకిలీ మద్యం ఎలా తయారు చేయగలుగుతాడో చెప్పాలన్నారు. జోగి రమేష్‌పై 12 అక్ర మ కేసులు పెట్టి 83రోజులు జైలులో ఉంచింది కాక రాజకీయంగా ఎదుగుతున్నాడని ఆయన కుమారుడు జోగి రాజీవ్‌పై 7కేసులు పెట్టారని మండిపడ్డారు. చివరకు భర్తను చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన ఆయన భార్య శకుంతలమ్మ, చిన్న కుమారుడిపై కూడా కేసులు నమోదు చేయడం చూస్తే బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకనో అర్థమవుతుందన్నారు. ఇన్ని కేసులు పెట్టి ఇంత వేధించినా తట్టుకొని నిలబడడమేంటని గూండాలతో పెట్రోలు బాంబులు, కర్రలు, రాళ్లతో జోగి రమేష్‌ ఇంటిపై దాడి చేయించి ఇంటిని తగలబెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు.

జోగి రమేష్‌ ఇంట్లో నిప్పు అంటుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు

వీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌ వద్ద బారులు తీరిన జనాలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

మామయ్య ఆశీర్వాదం.. ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థినిని దీవిస్తున్న వైఎస్‌ జగన్‌

మా బిడ్డొచ్చాడు.. జననేతను చూసి అభివాదం చేస్తున్న వృద్ధ మహిళలు

దాడి వివరాలను జగన్‌కు చెబుతున్న జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు, చిత్రంలో దేవినేని అవినాష్‌, మల్లాది, మొండితోక, వెలంపల్లి తదితరులు

జిరాక్స్‌ కాపీలతో దర్జాగా దర్శనాలు

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో టికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన దర్శన టికెట్లను కొందరు భక్తులు వాటిని జిరాక్స్‌ తీసి ఆ కాపీలతో దర్జాగా రాజమార్గంలో అమ్మవారి దర్శనాలు చేసుకుంటున్న వ్యవహారం బయటపడింది. నిజానికి.. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరూ తప్పనిసరిగా దర్శన టికెట్లు కొనుగోలు చేయాలి. అంతరాలయ దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరూ రూ.500 టికెట్‌ కొనుగోలు చేయాల్సిందే. ఇందు కోసం దేవస్థానం ఆన్‌లైన్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని ఓం టర్నింగ్‌ వద్ద కౌంటర్లు ఏర్పాటుచేసి టికెట్లు విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏ4 పేపర్‌పై ప్రింట్‌ తీసుకుని ఆలయానికి చేరుకుంటున్నారు.

కిటుకంతా ఇక్కడే..

దేవస్థాన కౌంటర్లలో విక్రయించే టికెట్లను చిన్న పేపర్‌ స్లిప్‌పై ప్రింట్‌ వేసి ఇస్తుంటారు. వీటితో దందా చేయడం కుదరని పని. కానీ, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ల విషయంలోనే కొందరు భక్తులు, పలువురు ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏ4 షీట్‌పై ఒకే టికెట్‌ను రెండు మూడు జిరాక్స్‌ కాపీలు ప్రింట్‌ తీసి దర్జాగా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. స్కానింగ్‌ పాయింట్‌, ఆలయ ప్రాంగణంలోని టికెట్‌ చెకింగ్‌ పాయింట్‌ వద్ద తనిఖీ చేస్తుండగా ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ అంశాన్ని ఆలయ ఈఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన శుక్రవారం టికెట్‌ చెకింగ్‌ పాయింట్‌ వద్ద తనిఖీలు నిర్వహించి ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవల ఇటువంటి టికెట్లపై ఎవరెవరూ దర్శనాలు చేసుకున్నారో గుర్తించారా అని వాకబు చేశారు.

7

వెస్ట్‌ బైపాస్‌ ఫ్లై ఓవర్‌ వద్ద 15 నిముషాల పాటు అభిమానులకు అభివాదం చేసిన వైఎస్‌ జగన్‌ 2.09గంటలకు నల్లకుంట గ్రామం సెంటర్‌కు చేరారు. అక్కడి నుంచి సూరాయిపాలెం జంక్షన్‌, గుంటుపల్లి జంక్షన్‌, ఖాజీపేట, తుమ్మలపాలెం జంక్షన్‌, వీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌ వంతెన, బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ వంతెన మీదుగా ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌కు 4.17కి చేరుకున్నారు. రింగ్‌సెంటర్‌లో భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతూ 5.05 గంటలకు జోగి రమేష్‌ నివాసానికి చేరుకున్నారు.

బెజవాడ దుర్గగుడిలో

ఆన్‌లైన్‌ టికెట్ల దందా

కొందరు భక్తులు, ఆలయ

సిబ్బంది చేతివాటం

దర్యాప్తునకు టెక్నికల్‌ సిబ్బందికి

ఈఓ ఆదేశాలు

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 36.2750 టీఎంసీలు.

దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.

పెడన: పెడనలో కలంకారి పరిశ్రమలను ఒడిశాకు చెందిన కళాకారులు శుక్రవారం పరిశీలించారు. అపూరమైన ఈ కళకు మంచి భవిష్యత్తు ఉందని వారు పేర్కొంటున్నారు.

గతంలో కూడా విశేష పర్వదినాలు, దసరా పండుగల్లో ప్రత్యేక కుంకుమార్చనకు, ఇతర ఆర్జిత సేవలకు ఇదే తరహాలో జిరాక్స్‌ కాపీలతో పూజలు, దర్శనాలు చేసుకుంటున్న వైనాన్ని దేవస్థానం అధికారులు గుర్తించి కట్టడి చేశారు. ఇప్పుడీ దందా దర్శన టికెట్లకు కూడా పాకడంతో ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ దందాలో కొంతమంది ఆలయ సిబ్బంది హస్తం కూడా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు టెక్నికల్‌ టీంకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

విజయవాడ సిటీ1
1/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ11
11/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ12
12/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ13
13/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ14
14/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ15
15/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ16
16/17

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ17
17/17

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement