జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలు వీరే.. | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలు వీరే..

Feb 10 2026 8:14 AM | Updated on Feb 10 2026 8:14 AM

జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలు వీరే..

జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలు వీరే..

విజయవాడ కల్చరల్‌: సంస్కార భారతి మహానగర్‌, సుమధుర కళానికేతన్‌ ఆధ్వర్యంలో భరతముని జయంతి సందర్భంగా నగరంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి నృత్యపోటీ విజేతల వివరాలను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పీవీఎన్‌ కృష్ణ, నగర అధ్యక్షుడు పసుమర్తి భాస్కరశర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. నాట్యాచార్యులు హేమంత్‌కుమార్‌, సుధీర్‌రావ్‌, సంతోష్‌, పద్మశ్రీ హేమంత్‌, యల్లా జోస్యుల అనూరాధ, తులసీ కృష్ణ, మంజూష, స్రవంతి, కల్పన నృత్యపోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని చెప్పారు.

విజేతల వివరాలు..

● కూచిపూడి నృత్యం సీనియర్స్‌ విభాగంలో సాయి వర్షిత వర్మ, భావన, నిఖిల లక్ష్మి, జూనియర్స్‌లో జాస్విత, యశ్వర్థిక్‌, నిశ్వన, సబ్‌ జూనియర్స్‌లో లోచన శ్రీ వర్షిత, దేవాన్విషి, ప్రీతి మహల్లిక ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు.

● భరతనాట్యం సీనియర్స్‌లో మధురిమ, సన్వితశ్రీ, నమోనిక, జూనియర్స్‌ విభాగంలో మిధున, మనస్వి ఫణి, సాయి లక్ష్మి, సబ్‌ జూనియర్స్‌లో నాగవర్నిక, ఆరాధ్యశ్రీ, దివ్యాన్‌ శ్రీసార విజేతలుగా నిలిచారు.

● ఆంధ్రనాట్యం సీనియర్స్‌లో షేక్‌ షర్మిళ, దేవార్షిణి, హరిణి, జూనియర్స్‌లో నాగత తన్విశ్రీ, లాస్య ప్రియ, తేజస్విని, సబ్‌ జూనియర్స్‌లో అక్షరదేశ్‌ పాండే, మేఘన, సహస్రలు వరుసగా ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.

● జానపద బృంద నృత్యంలో మధురిమ గ్రూప్‌, శ్రీ ఉమామహ్వేర గ్రూప్‌, తులసీ లహిత గ్రూప్‌, శాసీ్త్రయ బృంద నృత్యంలో శ్రీ కనకదుర్గా నాట్యమందిర్‌, అమృత గ్రూప్‌, సన్విశ్రీ గ్రూప్‌లు ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement