వ్యక్తిపై దాడి చేసి డబ్బులు కాజేసిన ఏడుగురు అరెస్ట్
పెనమలూరు: యనమలకుదురులో వ్యక్తి పై పలువురు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేసి, అతని వద్ద సొమ్ము కాజేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు గ్రామానికి చెందిన తాడిబోయిన గోపాలకృష్ణ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తాడు. ఈ నెల 7వ తేదీన యనమలకుదురు సుగాలి కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద నుంచి గోపాలకృష్ణకు తెలిసిన వ్యక్తి అయిన సాయి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. దీంతో రాత్రి 8 గంటలకు గోపాలకృష్ణ అక్కడికి వెళ్లగా.. సాయి అతని బైక్ ఎక్కి యనమలకుదురు హోసన్నా మందిరం వద్ద కృష్ణానదిలోకి తీసుకువెళ్లాడు. కొద్ది సమయం తరువాత సాయి పలువురికి ఫోన్ చేసి నది వద్దకు రమ్మని పిలిచాడు. నది వద్దకు విచ్చిన వ్యక్తులు గోపాలకృష్ణపై దాడి చేసి అతని వద్ద ఫోన్ తీసుకొని పేటీఎం ద్వారా రూ. 15 వేలు ఒకసారి, రూ. 12 వేలు మరోసారి దౌర్జన్యంగా సొమ్ము బదిలీ చేయించుకున్నారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. అయితే బాధితుడు 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరుగురు వ్యక్తులు అరెస్టు..
ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను సోమ వారం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో యనమలకుదురుకు చెందిన బత్తుల మహేష్, ఎం.దీపక్‌చంద్, రెబ్బ ఉజ్వల్, షేక్ సమీర్, బణావత్ బుజ్జి బాబు, రెబ్బ సంజయ్, మద్దెల పవన్ ఉన్నారు. నింది తులను విజయవాడ కోర్టులో హాజరు పర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది.
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్‌గాంధీ పార్కు ఎదురుగా రైల్వేట్రాక్ సమీపంలో కృష్ణానదిలో నీటిలో ఒక మహిళ మృతదేహం తేలుతున్నట్లు సోమవారం సాయంత్రం 5.30గంటలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఊరు, పేరుకు సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదు. మృతురాలు వయస్సు సుమారు 50ఏళ్లు ఉండవచ్చని, ఎరుగు రంగులో ఉండి పచ్చని జాకెట్, పింక్ చీర ధరించి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


