కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వంలో అరాచకాలు తీవ్రస్థాయికు చేరాయని, చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం వైఎస్సార్ సీపీలో పేరున్న నాయకులను టార్గెట్ చేసుకుని వారిపై కక్షసాధింపులు చేయటమే పాలనగా భావిస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శనివారం టీడీపీ నాయకులు చేసిన దాడి హేయమని, ఆయన రాష్ట్రంలో పేరున్న కాపు నాయకుడని, చంద్రబాబును అనలేదు అని చెప్పిన దాడి చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఇంటి మీదకు వస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, ఇంత హింసాత్మక ఘటన జరుగుతున్నా డీజీపీ ఏమి అయ్యారని, హోమ్ మంత్రి ఏమి చేస్తున్నారని నిలదీవారు. చంద్రబాబుకు పరిపాలన చేతకాక ఈ అటవీక పాలనా చేస్తున్నారని, వాస్తవాలు మాట్లాడితే ఇంటికి వెళ్లి కొడతారా అని ప్రశ్నించారు. జగనన్న వస్తే వీళ్లంతా రోడ్లు పైన తిరగగలరా అని, మా నేతలకు ఏమైనా అయితే సహించేది లేదని హెచ్చరించారు.


