సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్‌ను ఉపయోగించడం ద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకు ఆదా చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక లబ్బీపేటలోని ఓ హోటల్‌లో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇన్‌స్టాలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ అండర్ యుటిలిటీ లీడ్ అగ్రిగేషన్ మోడల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సోలార్ వినియోగంపై బుధవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు సోలార్ విద్యుత్ పరికరాల కొనుగోలుకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నామని చెప్పారు. ఏషియన్ డెవలప్‌మెంట్స్ బ్యాంక్ ప్రతినిధి టీవీఎస్‌ఎన్ మూర్తి, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో పాటుగా విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి


