ఆఫ్‌కాఫ్‌ చైర్మన్‌, పాలకవర్గం ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

ఆఫ్‌కాఫ్‌ చైర్మన్‌, పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Jan 30 2026 6:40 AM | Updated on Jan 30 2026 6:40 AM

ఆఫ్‌కాఫ్‌ చైర్మన్‌, పాలకవర్గం ప్రమాణ స్వీకారం

ఆఫ్‌కాఫ్‌ చైర్మన్‌, పాలకవర్గం ప్రమాణ స్వీకారం

ఆఫ్‌కాఫ్‌ చైర్మన్‌, పాలకవర్గం ప్రమాణ స్వీకారం

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఆఫ్‌కాఫ్‌) చైర్మన్‌, పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగింది. రాష్ట్ర మత్స్యసహకార సంఘాల సమాఖ్య (ఆఫ్‌కాఫ్‌) చైర్మన్‌గా యాటగిరి రాంప్రసాద్‌, డైరెక్టర్లతో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్‌ రాంప్రసాద్‌ మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు.

ఆధునికతను అందిపుచ్చుకోవాలి..

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్యకారులు పాత పద్ధతులను విడనాడి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఆర్థికంగా బలోపేతం కాగలమని పేర్కొన్నారు. ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పదవులను అలంకారప్రాయంగా చూడకుండా సామాజికవర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత మాట్లాడుతూ మత్స్యకారులకు డీజిల్‌తోపాటు వలలు, పడవలు, ఐస్‌ బాక్స్‌లు, మోపెడ్లపై సబ్సిడీలను అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌ శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం ద్వారా మత్స్యకారులకు మేలు చేకూరుస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, అగ్నికుల క్షత్రియ, బెస్త కార్పొరేషన్ల చైర్మన్లు పాపారావు, శ్రీధర్‌, జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షులు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

హాజరైన వివిధ శాఖల మంత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement