లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు
హజ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరానికి చెందిన చందన సీతారావమ్మ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందచేసింది. గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన పాములపాటి రాజేశ్వరరావు, శేషరత్నం దంపతులు కుమార్తె, అల్లుడు మణిశ్రీ, రామకృష్ణల పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు చేతుల మీదగా దేవస్థానానికి అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు):లారీ ఢీకొనడంతో ద్విచక్ర వామనంపై వెళ్తున్న కారు డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన శ్రీరాం సందీప్ (25) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అదుపుతప్పి లారీ వెనుక చక్రం కిందపడి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు):హజ్ యాత్రికులు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని, వ్యాక్సిన్ వేయించుకోవాలని, వారి కోసం ప్రభుత్వాస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహిహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా శనివారం ఆమె శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. హజ్ యాత్రకులకు ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్ వంటి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. వారికి కావాల్సిన హెల్త్ కార్డును పరిపూర్ణంగా పూర్తి చేయించుకుని మాత్రమే వెళ్లాలని కోరారు. యాత్రికులు 101 మంది శనివారం నమోదు కాగా, వారిలో 90 మందికి పరీక్షలు పూర్తి చేశామని, ఇద్దరు అనర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతి, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులు డాక్టర్ నూరుల్లా, నోడల్ ఆఫీసర్ ఫాజల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
● టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
బంటుమిల్లి: మండల పరిధిలోని ముంజులూరు గ్రామ శివార్లలో 216 జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బందరు మండలం, గిలకలదిండి గ్రామానికి చెందిన మోకా శివకృష్ణ (40) భార్యాపిల్లలను అత్తారిల్లు కృత్తివెన్ను మండలం, పోడు గ్రామంలో దించేందుకు ఈ నెల 5వ తేదీన ద్విచక్రవాహనంపై వచ్చారు. అనంతరం 6వ తేదీ రాత్రి పోడు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్లేందుకు బయలుదేరాడు.ముంజులూరు సమీపంలోని టోల్ ప్లాజా సమీపంలో రోడ్డుపై వెళుతున్న లారీ ఢీకొనడంతో శివకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ ఎ.గణేష్‌కుమార్ టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాలపై దృష్టి పెట్టగా ఈ ప్రమాదానికి టిప్పర్ కారణమని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా డ్రైవరు జరిగిన ప్రమాదం విషయం చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పంచాయతీ రాజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ నాగార్జున సాగర్
జీజీహెచ్‌లో ప్రత్యేక వైద్య శిబిరం
లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు
లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు


