ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం

Feb 11 2026 8:53 AM | Updated on Feb 11 2026 8:53 AM

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సురక్షిత బ్యాంకింగ్‌ విధానాలు, డిజిటల్‌ లావాదేవీలు, పొదుపు అలవాట్లపై అవగాహన పెంపొందించుకోవా లని సూచించారు. కలెక్టరేట్‌ శ్రీ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో కలిసి ఆర్‌బీఐ – ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల (ఫిబ్రవరి 9 నుండి 13 వరకు) పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందేందుకు కూడా అవగాహన అవసరమన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తన, బ్యాంకింగ్‌ సేవలు, బీమా, పెన్షన్‌ పథకాలు, డిజిటల్‌ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎల్‌డీఎం కె.ప్రియాంక, జీఎం డీఐసీ మధు, ఎస్‌బీఐ కోఆర్డినేటర్‌ జగదీష్‌, కెనరా బ్యాంక్‌ కోఆర్డినేటర్‌ రాఘవరెడ్డి పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగ కుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌ రెడ్డి కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. జిల్లాలో మాన్యువల్‌ పద్ధతిలో ఇసుక లోడు చేసేందుకు గుర్తించిన నాలుగు రీచ్‌లకు ఈ–టెండర్‌ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మల్కాపురం, ఏటూరు, మున్నలూరు, గని ఆత్కూరు ఇసుక రీచ్‌లు గుర్తించారు. సెమీ మెకనైజ్డ్‌ పద్ధతిలో ఇసుక తవ్వకానికి పొక్కునూరు–4 రీచ్‌కు అన్ని అనుమతులు పొందినందున ఈ –టెండర్‌ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయాలని సమావేశం నిర్ణయించింది. పట్టా భూముల్లో ఇసుక తీసి రవాణా చేసేందుకు మల్కాపురంకు చెందిన పట్టాదారు జ్వాలా ప్రసాద్‌, దాములూరుకు చెందిన ఘంటా లక్ష్మణ్‌కు అనుమతులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఇసుక కొరత లేకుండా ప్రభు త్వం నిర్ణయించిన ధరకు ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. మెంబర్‌ కన్వీనర్‌ ఆలా శ్రీనివాస్‌ కుమార్‌, పీసీబీ ఈఈ శ్రీనివాస్‌, రివర్‌ కన్జర్వేటర్‌ రవికిరణ్‌, జిల్లా పంచా యతీ అధికారి, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ డీడీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement