నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 12:10 PM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కాకినాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. కాకినాడ రమణయ్యపేటకు చెందిన గారికపర్తి నమశ్శివాయ కోట సూర్య నర సింహ, నాగమణి అమ్మవారి దర్శనానికి ఇంద్ర కీలాద్రికి విచ్చేశారు. 

ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,152 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. 12 జీవాలు అగ్నికి ఆహుతి 18 నుంచి టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు డ్రగ్స్‌ను తరిమేద్దాం.. భవితను కాపాడుకుందాం..

అగ్నిప్రమాదంలో పశువుల పాక బుగ్గి
తోట్లవల్లూరు: మండలంలోని యాకమూరులో జరిగిన అగ్నిప్రమాదంలో పశువుల పాక బుగ్గిపాలైంది. స్థానిక పాలకేంద్రం ఎదురు బజారులో నివశించే మహ్మద్‌ అస్మదుల్లాకు చెందిన పశువుల పాకకు బుధవారం వేకువజామున 2.30 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు గొర్రెలు, ఎనిమిది మేకలు సజీవదహనమయ్యాయి. మూడు గేదలు తీవ్రంగా గాయపడ్డాయి. పశువులను కాపాడే క్రమంలో యజ మాని అస్మతుల్లాకు కూడా ఒంటిపై గాయాలయ్యాయి. ఎవరో కావాలనే పశువుల పాకకు నిప్పు పెట్టినట్లుగా బాధిత కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో రూ.3 లక్షలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. పామర్రు ఫైర్‌ అధికారి రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, తహసీల్దార్‌ కుసుమకుమారి బాధిత రైతు అస్మతుల్లాను పరామర్శించారు. వీఆర్‌ఓ అక్బర్‌బాషా నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు.

18 నుంచి లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు
వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు (డ్రాయింగ్‌, హ్యాండ్లూమ్‌, వీవింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ) సంబంధించి లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వర జరుగుతాయని ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ బుధవారం తెలిపారు. హ్యాండ్లూమ్‌, వీవింగ్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి
అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): మన ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు అన్నారు. డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పోలీసు శాఖ చేపట్టిన ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ కార్యక్రమం బుధవారం అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ముందుగా పోలీసులు, విద్యార్థులు కలిసి ‘డ్రగ్స్‌ను తరిమికొడదాం – దేశ భవిష్యత్తును కాపాడుదాం’ అనే నినాదంతో సైకిల్‌ యాత్ర చేపట్టారు. 

గంగిరెద్దుల ఆటలు, తీన్‌మార్‌ డాన్సులతో కేదారేశ్వరాపేటలోని ప్రభాస్‌ కళాశాల నుంచి లోటస్‌ ల్యాండ్‌ మార్క్‌, యర్రకట్ట, పాత రాజరాజేశ్వరి పేట మీదుగా కొత్త రాజరాజేశ్వరిపేట, కేర్‌ అండ్‌ షేర్‌ స్కూల్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీపీ రాజశేఖరబాబు ప్రసంగించారు. డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 35 రోజులు జరిగే సైకిల్‌ యాత్రను చేపట్టామని తెలిపారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ బారిన పడితే జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ షిరిన్‌ బేగం, ఏడీసీపీ జి.రామకృష్ణ, నార్త్‌ జోన్‌ ఏసీపీ స్రవంతి రాయ్‌, సింగ్‌నగర్‌ సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లు పలువురు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక రైలు పొడిగింపు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ – అనకాపల్లి మధ్య ఇప్పటి వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును పొడిగించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌ – అనకాపల్లి (07041) ప్రత్యేక రైలు ఈ నెల 22న ఆదివారం, అనకాపల్లి – సికింద్రాబాద్‌ (07042) ఈ నెల 23న సోమవారం కూడా నడవనున్నట్లు తెలిపారు.

నిత్యాన్నదానానికి  రూ.లక్ష విరాళం 1
1/1

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement