‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు | Coalition Government Conspiring Against Ysrcp Vennupotu Dinam | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు

Jun 1 2025 7:01 PM | Updated on Jun 1 2025 7:27 PM

Coalition Government Conspiring Against Ysrcp Vennupotu Dinam

సాక్షి, విజయవాడ: జూన్‌ 4న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా వెన్నుపోటు దినం రోజున వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోంది. 

జూన్ 4 న వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టే నిరసనలకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శ్రీకాకుళం, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో వెన్నుపోటు దినం నిమిత్తం వైఎస్సార్‌సీపీ నేతలు అనుమతుల కోసం పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. అయితే, నేతల విజ్ఞప్తుల్ని పోలీసులు నిరాకరించారు. పలుచోట్ల సెక్షన్ 30 అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రజాస్వామ్య విధానాలు,రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేలా కూటమి ప్రభుత్వం అరాచకానికి దిగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు కోరుతున్న అనుమతులు తిరస్కరించేలా చంద్రబాబు పోలీసుల్ని వాడుకోవడం గమనార్హం.

కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేలా వెన్నుపోటు దినం
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారు. 

‘జూన్‌ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున  ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement