
కాకినాడ జిల్లా గత ఏడాది కాలంలో ఇచ్చిన హామాలను అమలు చేయకుండా కుడి, ఎడమలగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని దగా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఉత‍్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ రోజు(సోమవారం, జూన్2) కాకినాడ రూరల్‌లో వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆవిష్కరించారు కురసాల కన‍్నబాబు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా వాటిని చంద్రబాబు దుర్మార్గంగా చిత్రీకరించారు. చెప్పిన హమీని ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలను నిలిపివేశారు. వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపిస్తున్నారు. అధికారాన్ని అనుభవించడం కోసమే గత ఏడాదిగా చంద్రబాబు పని చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి..రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు* అని విమర్శించారు.