
అసలే వృద్ధురాలు. ఊతకర్ర లేనిదే నడవలేదు. అయినా బియ్యం కోసం దుకాణానికి వచ్చింది. సర్వర్ పనిచేయక గంటల తరబడి నిరీక్షించింది. ఎట్టకేలకు బియ్యం ఇచ్చాక.. సంచి భుజాన పెట్టుకుని మోయలేక అవస్థలు పడుతూ ఇంటికి బయలుదేరింది. నెల్లూరు ఈద్గామిట్ట ప్రాంతంలో సోమవారం కనిపించిన దృశ్యమిది. (సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు)

విజయవాడ వన్‌టౌన్ కొత్తపేట సమీపంలోని రేషన్ డిపో వద్దకు నడవలేని స్థితిలోనూ స్టాండ్ సాయంతో సరుకుల కోసం వచ్చిన వృద్ధురాలు

విశాఖపట్నం కోటవీధి వద్ద రేషన్ డిపోలో సర్వర్ మొరాయించడంతో తలపట్టుకున్న లబి్ధదారులు

విజయవాడ వాంబే కాలనీ సమీపంలో సర్వర్ పనిచేయక పోవటంతో క్యూలైన్‌లో వేచి ఉన్న కార్డుదారులు

కర్నూలు కప్పల్ నగర్‌లో సర్వర్ పనిచేయకపోవడంతో సోమవారం పొద్దుపోయేవరకు వేచి ఉన్న లబ్ధిదారులు

విశాఖపట్నం అల్లిపురంలో సరకుల మూటలు మోసుకొస్తున్న మహిళలు

సర్వర్ పనిచేయకపోవడంతో రాజమహేంద్రవరంలో తలపట్టుకున్న డీలర్

అనంతపురంలో రేషన్ బియ్యం మూటను మోసుకెళ్తున్న వృద్ధురాలు

శ్రీకాకుళం జిల్లాలో రేషన్ తెచ్చుకుంటున్న వృద్ధురాలు

ఏలూరు కొత్తపేటలో సర్వర్ పనిచేయకపోవడంతో వృద్ధులు, మహిళల పడిగాపులు

ఒంగోలు బలరాం కాలనీలో రేషన్ షాపు వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్న కార్డుదారులు