‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’ | YSRCP Leader Ambati Rambabu Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’

Jun 5 2025 6:12 PM | Updated on Jun 5 2025 6:58 PM

YSRCP Leader Ambati Rambabu Slams Chandrababu Govt

తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ  వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా, దాన్ని అధిగమించి ప్రజలు సక్సెస్‌ చేశారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు.  ఈరోజు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి..  ఇప్పటికైనా చంద్రబాబు పాలన గురించి ఆలోచించాలని హితవు పలికారు. 

‘ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించాం.వైఎస్సార్‌సీపీ  వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనంనుంచి అద్బుతమైన స్పందన లభించింది.వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారు.ఏడాదిగా వైఎ‍స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులుపెట్టి వేధించారు.

సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదు.ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలి. దోచుకునే బ్యాచ్‌కే పండుగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలి .రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు-2 సమయానికి‌ జనం తిరగబడొచ్చు.వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్. బెదిరించి, భయపెట్టాలని చూశారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చింది. నేను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారు. లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు’ అని అంబటి స్పష్టం చేశారు. 

Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్

Advertisement
 
Advertisement
Advertisement