‘కూటమి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది.. మోసం చేస్తోంది’ | MLC Botsa Satyanarayana Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘కూటమి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది.. మోసం చేస్తోంది’

Jul 17 2026 6:04 PM | Updated on Jul 17 2026 6:56 PM

MLC Botsa Satyanarayana Slams Chandrababu

సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సైతం తల్లికి వందనంలో కోత విధించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. మీరు చెప్పిన మాటలకు బడ్జెట్‌లో కేటాయించిన కేటాయింపులకు ఏమైనా సంబంధం ఉందా?.బడ్జెట్‌లో కేటాయింపులకు ఎంత మార్చారు. ఎంత రిలీజ్‌ చేశారో దేవుడికే తెలియాలి. కూటమి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది.. మోసం చేస్తోంది. తొలి ఏడాదిలోనే అమ్మకు వందనం డబ్బులు ఎగ్గొట్టారు. ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్ధుకుంటుందనే చెబుతున్నాం. విద్యార్థుల తల్లులు చెప్పిన మాటలనే మేం మాట్లాడుతున్నాం’అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement