‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’ | YSRCP Leader Kakani Govardhan Reddy Savals To Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

Jul 17 2026 3:58 PM | Updated on Jul 17 2026 4:04 PM

YSRCP Leader Kakani Govardhan Reddy Savals To Nara Lokesh

ప్రకాశం: మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. లోకేష్‌కు ఐదు వ్యవసాయం మొక్కలు చూపిస్తానని,  ఆ మొక్కల పేర్లు ఆయన కరెక్ట్‌గా చెప్తే తాను రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని చాలెంజ్‌ ‍చేశారు. ఇది తాను ఒంగోలు నుండి లోకేష్‌కి విసురుతున్న సవాల్‌ అన్నారు కాకాణి.

రాష్ట్రానికి ఆదాయవనరులు జగన్ సమకూరిస్తే   వాటిని చంద్రబాబు అమ్ముతున్నాడు. చంద్రబాబు రైతులకు అండగా ఉండడు. గ్రావెల్‌లో  అవినీతి, దగా డిఎస్సీలో అవినీతి.. ఇలా ప్రతి దానిలో అవినీతి. అవినీతికి కాదేది అనర్హం అనే విధంగా కూటమి ప్రభుత్వం దోచుకొంటుంది. ప్రజల సొమ్ముని ప్రయివేటు పరం చేస్తూ  పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు లోకేష్‌లకు దోచుకోవడమే పరమావధి. ప్రతిష్టాత్మక రామాయపట్నం పోర్ట్‌ని ప్రయివేట్‌ పరం చేసేశారు’ అని ధ్వజమెత్తారు కాకాణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement