గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 21వ తేదీన నిర్వహించిన నీట్ రీ–ఎగ్జామ్‌లో 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన పలువురు జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ర్యాంకులు కై వసం చేసుకున్నారు. జూన్ 21న 22 కేంద్రాల పరిధిలో 6,645 మంది పరీక్ష రాశారు. గుంటూరుకు చెందిన వేల్పుల ధీరజ్ కృష్ణ జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 342వ ర్యాంకు, రిజర్వుడు కేటగిరీలో 95వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. వివిధ కేటగిరీల్లో సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115, వి.రేచల్ అమృత 154, సిద్ధార్థ 164, ఆళ్ల ఎస్‌ఎస్ నిఖితారెడ్డి 288, గాలి హర్షవర్ధన్ 433, బంటు ధాత్రిక 507, ఎం. రాకేష్ చౌదరి 519, ఎల్.వెంకట గౌతమ్ 620, సూరా సుమతి 696, జి.భరత్ రెడ్డి 898, నిహాల్ పర్వేజ్ 935, పి.నిహాల్ దీప్ 935, ఎ. నికేత్ రామ్ చౌదరి 1514, బి. శశిధర్ 1620వ ర్యాంకును కై వసం చేసుకున్నారు. ర్యాంకర్లకు కోరుకున్న కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు దక్కే అవకాశం ఉంది.


