గుంటూరు ఎడ్యుకేషన్: వెంగళరావునగర్‌లోని నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో నాడు–నేడు ద్వారా నిర్మించిన తరగతి గదులకు ఫినిషింగ్ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెస్తూ శుక్రవారం ‘‘సాక్షి’’లో ప్రచురించిన ‘నాడు వడివడి.. నేడు తడబడి’ కథనానికి సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి స్పందించారు. పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, తరగతి గదులను విద్యార్థినులకు అందుబాటులో తెస్తామని చెప్పారు. మనబడి మన భవిష్యత్తు రెండో దశలో భాగంగా సదరు పాఠశాలలో రూ.నాలుగు లక్షలతో ఫ్లోరింగ్ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మిగిలిన పనులను సైతం వేగవంతంగా పూర్తి చేసి, ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


