విజయవాడ: టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మణిపై మరో వర్గం దాడి చేసింది. మణి కాళ్లు, చేతులు విరగొట్టింది టీడీపీలోని మరోవర్గం. కారుతో గుద్దించి కర్రలు , కత్తులతో దాడికి పాల్పడ్డారు. కారుతో వెంటాడి మరీ ఢీకొల్టారు. కిందపడిపోయిన మణి రెండు కాళ్ల పై నుంచి కారును పోనిచ్చారు దుండగులు.
మూడు రోజుల క్రితం నారా లోకేష్ టీమ్ పై మణి పరోక్ష పోస్టులు పెట్టారు. చినబాబు టీమ్ నన్ను బెదిరిస్తే నేను ఎదిరిస్తా అంటూ పోస్టు పెట్టాడు మణి. చినబాబు పీఏ సాంబపై సైతం మణి పోస్టులు పెట్టాడు. ఓ మహిళ కోసం చినబాబు పీఏ సాంబ చెత్త పనులు చేస్తున్నాడంటూ అనే పోస్టు పెట్టాడు. మంచోడు మణి పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
పోస్టులు పెట్టిన 24 గంటల వ్యవధిలోనే మణి పై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. మణి పై దాడి వెనుక పామర్రు టిడిపి మహిళా నేత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణిపై జరిగిన దాడి పై టీడీపీ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఇదిలా ఉంచితే, మణి పై హత్యాయత్నం చేసినా కేసు నమోదు చేయలేదు పోలీసులు.


