‘ఖర్చు రూ.300 కోట్లు.. కానీ గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేకపోయారా? చంద్రబాబు’ | Gudivada Amarnath Slams Chandrababu Naidu Over Yogandhra Event, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఖర్చు రూ.300 కోట్లు.. కానీ గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేకపోయారా? చంద్రబాబు’

Jun 22 2025 5:46 PM | Updated on Jun 23 2025 10:22 AM

Gudivada Amarnath Slams Chandrababu Naidu over Yogandhra event

సాక్షి,విశాఖ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా కార్యక్రమాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారు. యోగాకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదు.డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట.

హామీల అమలును ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్‌సీపీ యువతపోరు కార్యక్రమం చేపడుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ యువత పోరు నిర్వహిస్తున్నాం. చంద్రబాబును ప్రజల్ని నమ్మి నట్టేటా ముంచారు. విశాఖకు ప్రధాని మోదీని ఆహ్వానించి పెద్ద డ్రామా చేశారు. గిరిజన పిల్లల్ని యోగా పేరుతో ఇబ్బంది పెట్టారు. 300 కోట్లు ఖర్చు చేసి కనీసం బోజనాలు, మ్యాట్స్, టిఫిన్స్, మంచి నీళ్ళు ఇవ్వలేక పోయారు. ప్రజల్ని డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు యోగా డ్రామాలు. తక్కువ సమయంలో ఎక్కువ అప్పలు చంద్రబాబు రికార్డ్‌ సృష్టించారు. వైఎస్సార్‌సీపీ హాయాంలో జరిగిన అభివృద్ధి తమ హాయంలోనే జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది’అని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement