మైలవరం: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం సజ్జపాడులో టీడీపీ నాయకులు బరితెగించింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన వినోద్, రాజేష్ ఇళ్లపై టీడీపీ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మహిళలపైనా విచక్షణారహితంగా టీడీపీ గూండాలు దాడులు చేశారు. తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. మరొకవైపు టీడీపీ నేతలతో పోలీసులు మంతనాలు జరుపుతున్నారు.
సజ్జపాడులో ఓ శుభకార్యం వద్ద ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగగా, దాన్ని టీడీపీ నేతలు పెద్దది చేశారు. ఆ శుభ కార్యం వద్ద సైలెంట్‌గా ఉన్న టీడీపీ నాయకులు.. ఆపై ఆ వివాదాన్ని సాకుగా చూపి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వినోద్, రాజేష్‌ల ఇళ్లపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు.


