బాబూ.. 9,000 కోట్ల అప్పు కోసం.. 1,91,000 కోట్ల గనుల తాకట్టు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Serious On CBN Govt Over APMDC | Sakshi
Sakshi News home page

బాబూ.. 9,000 కోట్ల అప్పు కోసం.. 1,91,000 కోట్ల గనుల తాకట్టు: వైఎస్‌ జగన్‌

Jun 26 2025 12:49 PM | Updated on Jun 26 2025 1:53 PM

YS Jagan Serious On CBN Govt Over APMDC

సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.. 5,526 కోట్లను బాండ్ల జారీ  ద్వారా అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ. 5,526 కోట్లను బాండ్ల జారీ  ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా APMDCపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి?. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క​ ఏడాదిలోనే చేశారు’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement